రాజధాని విషయంలో వైసీపీ అటు ప్రజల్ని, ఇటు ఇన్వెస్టర్లను మోసం చేసేందుకు రెడీ అయిపోయిది. ఈ విషయాన్ని సజ్జల స్వయంగా చెబుతున్నారు. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఎన్నో చెబుతామని ఆయన కవర్ చేసుకున్నారు. ఓట్లు వేయించుకోవడానికి కూడా ప్రజలకు ఎన్నో చెప్పారు. ఆయన ఉద్దేశం కూడా అదే. అయితే ఇప్పుడు ప్రజలకు ఓ క్లారిటీ వస్తోంది. రాజధాని పేరుతో నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని వల్లకాడు చేసిన వైసీపీ పాలన తీరుపై ప్రజల్లో చైతన్యం వస్తోంది.
రాయలసీమ వాసులకు ఇంత నమ్మకద్రోహమా ?
రాయలసీమ వాసులకు అతి సమీపంలో బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలు ఉన్నాయి. ఇక వారంతా ఆయా రాష్ట్రాలకు పోకుండా మన రాజధానికే ప్రభుత్వ పనులకే కాకుండా వ్యాపారాలకూ రావాలంటే.. మన రాజధానిలో వారికి ఎన్ని అవకాశాలు కల్పించాలి. కానీ అలాటి అవకాశం లేకుండా సుదూరంగా రాజధానిని నెట్టేస్తున్నారు. శాశ్వతంగా సీమను అంధకారంలో ముంచేస్తున్నారు. విశాఖ రాజధాని అంటే.. సీమ వాసులకు తీవ్ర నష్టం జరుగుతుంది. హైదరాబాద్ కన్నా వారికి విశాఖ రెట్టింపు దూరం అవుతుంది. ఈ అంశంపై సీమ ప్రజల అభిప్రాయాన్ని ఓట్ల ద్వారా తెలుసుకోవాల్సిందే.
కోస్తా ప్రజలపై విష ప్రచారం … వారి అభిప్రాయం తెలుసుకోరా ?
రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ధింక్ బిగ్ అన్నట్లుగా రాజధాని నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. అప్పట్లో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇప్పుడు కోస్తా ప్రజలకే అన్నీ ఇస్తున్నారన్నట్లుగా వైసీపీ నేతలు విమర్శలు చేసి.. దారుణంగా కించ పరుస్తున్నారు. రాజధాని విషయంలో కోస్తా ప్రజల అభిప్రాయాన్ని తీసుకపోతే ప్రజలు ఓట్లతో కొట్టే చాన్స్ ఉంది.
రాజధాని కోసం ఎవరూ ఉద్యమాలు చేయలేదు !
అమరావతి రాజధాని కావాలని కోస్తా ప్రజలు ఉద్యమాలు చేయలేదు. ఆ మాటకు వస్తే.. ఎక్కడ రాజధాని చేయాలన్న చర్చ వచ్చినప్పుడు.. మా ప్రాంతానికే రాజధాని కావాలని ఎక్కడా ఉద్యమాలు జరగలేదు. ప్రజలు రాజధాని అడగలేదు.కానీ ప్రభుత్వం విశాఖలో రాజధాని పెడితే ప్రపంచ స్థాయి నగరం అవుతుందని చెబుతున్నారు. కానీ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. సీఎం స్థానంలో ఉండి.. అలాంటివేమీ పట్టించుకోవడం లేదు జగన్.
ప్రజాభిప్రాయం కోరడమే మంచిది !
ఏ విధంగా చూసినా ప్రజల్ని.. ఇన్వెస్టర్లను.. నమ్మిన వారందర్నీ మోసం చేసేందుకు రాజధాని నాటకం ఆడుతున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఇది బలపడకముందే జగన్ జనాభిప్రాయం తీసుకోవడం మంచిది. ఈ విషయంపై రాజకీయ పార్టీలు కూడా సవాళ్లు చేస్తున్నాయి.