ఏపీ క్యాడర్లో చేరిన సీనియర్ ఐఏఎస్ సోమేష్ కుమార్.. ఏదో ఓ బాధ్యత చేపట్టడానికి ఇష్టపడటం లేదు. తాను సీఎస్‌గా పని చేసినందున ఇక చిన్న స్థానాల్లో పని చేయడం దండగని.. అదీ కూడా ఏపీ ప్రభుత్వంలో పని చేయడం దండగని ఆయన అనుకుంటున్నారు. నిజానికి సోమేష్ కు కీలక పోస్టును సీఎం జగన్ ఆఫర్ చేశారు. సీఎస్ ను చేయలేము కానీ.. గౌరవానికి తగ్గకుండా చూస్తామని పోస్టింగ్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే సోమేష్ మాత్రం.. తాను వీఆర్ఎస్కు మొగ్గు చూపుతున్నారు.
ఈ మేరకు ఆయన తన లేఖను సీఎం జగన్ కు పంపారు. పోస్టింగ్ తీసుకోవడానికి సోమేష్ సిద్దంగా లేకపోవడంతో ఆయనకు వీఆర్ఎస్ ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఈ ఫైల్ పై రేపోమాపో సంతకం పెడతారని అంటున్నారు. తెలంంగాణ సీఎస్ గా ఉన్నప్పుడు.. ఆయన ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సిందేనని డీవోపీటీ ఆదేశించింది. దీంతో రాత్రికి రాత్రే.. ఆయన పదవి పోయింది. తర్వాతి రోజే ఏపీలో రిపోర్టు చేశారు.
మీడియాతో మాత్రం .. తాను సర్వీసుకు నిబద్ధుడినై ఉంటానని…. పదవుల్లో చిన్నా పెద్దవి… ప్రాధాన్యత ఉన్న వి లేనివి ఉండవని… ఎలాంటి పోస్టింగ్ ఇచ్చినా చేస్తానన్నారు. కానీ చివరికి ఆయన వీఆర్ఎస్కే మొగ్గు చూపారు. ఆ తర్వతా ఆయనను తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా నియమిస్తుందన్న ప్రచారం జరుగుతోంది.