సర్కారు వారి పాట తరవాత మరో హీరోకి కథ చెప్పి, ఒప్పించడానికి చాలా సమయం తీసుకొన్నాడు పరశురామ్. ఎట్టకేలకు విజయ్ దేవరకొండతో సినిమా ఓకే అయ్యింది. ఈలోగా మరో ప్రాజెక్టునీ ఫైనలైజ్ చేసేసుకొన్నాడు. ఈసారి కార్తి కోసం ఓ కథ రాసుకొన్నాడు పరశురామ్. ఇటీవలే… చెన్నైని వెళ్లి, కార్తిని కలిసి వచ్చాడు కూడా. కార్తి కూడా పరశురామ్ తో సినిమా చేయడానికి పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మిగిలిన తమిళ హీరోల్లానే కార్తి ఈ మధ్య తెలుగు సినిమాలపై గట్టిగా ఫోకస్ చేస్తున్నాడు. ఊపిరి తరవాత తెలుగులో ఓ స్ట్రయిట్ సినిమా చేయాలని చాలా కథలు విన్నాడు. చివరికి పరశురామ్ కథ కార్తికి బాగా నచ్చింది. నటుడిగా 25 చిత్రాల మైలురాయికి దగ్గర పడుతున్నాడు కార్తి. పరశురామ్ సినిమా.. కార్తీకి 25వ సినిమా అయ్యే అవకాశం ఉంది. అయితే పరశురామ్ ముందుగా విజయ్ సినిమానే పూర్తి చేస్తాడు. ఆ తరవాత… కార్తి సినిమా మొదలవుతుంది.