ఏపీ పోలీసులు పూర్తిగా విచక్షణ కోల్పోతున్నారు. చట్టం, న్యాయం, ప్రజాస్వామ్య హక్కులు, పౌరుల ప్రాథమిక హక్కులు లాంటివి ఏమీ పట్టించుకోవడం లేదు. తాజాగా చంద్రబాబు ఆనపర్తి టూర్ విషయంలో పూర్తి స్థాయిలో పరిస్థితులు దిగజారిపోయేలా చేసింది కాకుండా… చంద్రబాబుతో పాటు ఏకంగా వెయ్యిమందిపై కేసులు పెట్టారు. ఫిర్యాదుదారులు కూడా పోలీసులే., డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేశారు.
ఆనపర్తి పర్యనటలో సభ నిర్వహించడానికి చంద్రబాబుకు మొదట పర్మిషన్ ఇచ్చారు. తర్వాతి రోజు హఠాత్తుగా రద్దు చేస్తున్నట్లుగా నోటీసులు ఇచ్చారు. అక్కడ్నుంచి అసలు డ్రామా ప్రారంభించారు., పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మారి.. రోడ్లకు వాహనాలు పెట్టడం.. రోడ్డుపై బైఠాయించడం వంటివి చేశారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న నాయకుడి విషయంలో ఎలా వ్యవహరించాలన్న దాన్నీ పట్టించుకోలేదు. కరెంట్ ఆపేశాలు.. జనరేటర్ ఆపరేటర్ ను కిడ్నాప్ చేశారు. ఇలాంటివన్నీ చేసిన తర్వాత కూడా సభలో తొక్కిసలాట నిర్వహించడానికి పోలీసులు తోపులాటకు దిగారన్న ఆరోపణలు వచ్చాయి.
అంతా చేసి ఇప్పుడు చంద్రబాబుతో పాటు వెయ్యి మందిపై కేసులు పెట్టారు. ఇలాంటి కేసులకు టీడీపీ నేతలు భయపడటం ఎప్పుడో ఆగిపోయింది. ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు పెట్టుకోమని సవాల్ చేస్తున్నారు. దీంతో పోలీసులూ అలుసైపోతున్నారు. తప్పుడు కేసులు పెట్టి.. ఇప్పటి వరకూ రిమాండ్కు తరలించలేని స్థితికి వారు వెళ్లిపోయారు. ఇప్పుడు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో సమిథలవుతున్నారు. పోలీసు వ్యవస్థలో ఓ వర్గం మొత్తాన్ని ప్రతిపక్ష పార్టీకి టార్గెట్ చేసే కుట్రలో అధికార పార్టీ సక్సెస్ అవుతోంది.