తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. సోమేష్ కుమార్ వీఆర్ఎస్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోమేశ్ కుమార్‌కు ఈ ఏడాది డిసెంబర్ వరకూ సర్వీస్‌లో కొనసాగే అవకాశముంది. కానీ ఆయన వీఅరెస్కే మొగ్గు చూపారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. సోమేష్ కుమార్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ధరణి లాంటి వ్యవస్థను తీసుకొచ్చి… కేసీఆర్ కు ఎవరూ చేయనంత మేలు చేశారని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే కేసీఆర్ కూడా ఆయనపై ఎంతో నమ్మకంగా ఉంటారని చెబుతున్నారు.
ఏపీలో వీఆర్ఎస్ తీసుకుని వస్తే బీఆర్ఎస్ పనులు చేసుకుందామని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన స్వస్థలం బీహార్. సోమేష్ కుమార్ కి బిహార్ లోని రాజకీయలపై పట్టు ఉంది. ప్రశాంత్ కిషోర్ తో గంటల కొద్దీ మాట్లాడే చనువు ఉంది. దేశ రాజకీయాలపై పూర్తిస్థాయి అవగాహన ఉంది. సర్వేల ఇన్ పుట్స్ ఎప్పటికప్పుడు కేసీఆర్ కి చేరవేయగలరు. పార్లమెంట్ ఎన్నికల వరకు బిహార్ లోని ఏదో ఓ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున బరిలోకి దింపవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆయనకు వచ్చే ఎన్నికల వరకూ సలహాదారు పదవి ఇవ్వవొచ్చని చెబుతున్నారు.
ఇప్పుడు సివిల్ సర్వీస్ అధికారులు తెలివి మీరిపోయారు. ముఖ్యంగా రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న వారు …తమ రిటైర్మెంట్ అనంత ప్లాన్స్ ను అమలు చేసుకోవడానికి… తమ సర్వీస్ లో సాధించుకున్న పేరును కూడా వదులుకోవడానికి కూడా వెనుకాడం లేదు. అధికార పార్టీల అక్రమాలకు వంత పాడి రిటైర్మెంట్ తర్వాత ఇతర కెరీర్ పొందుతున్నారు. కానీ తప్పు చేస్తున్నామని అనుకోవడం లేదు. ఫలితంగా రాజకీయ పార్టీలు కూడా వారిని అలా ఉపయోగించుకుంటున్నాయి.