వైసీపీ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఎందుకంటే శివరాత్రి సందర్భంగ వైసీపీ ఓ గ్రాఫిక్ రిలీజ్ చేసింది. అందులో .. బాల శివుడిగా జగన్ నోట్లో పాలు పోస్తున్నట్లుగా ఉంది. ఈ పోస్టర్ అధికారికంగా వైసీపీ హ్యాండిల్ లోనే పోస్టు చేశారు. దీనిపై హిందూ వర్గాలు భగ్గుమన్నాయి. దేవుడు అంటే ఇంత చులకనా అని ప్రశ్నించారు. రాజకీయంగా ఎక్కువ మంది జీవీఎల్ ను ట్యాగ్ చేశారు. ఇప్పుడు మీ మనోభావాలకు ఏం కాలేదా అంటూ ప్రశ్నించడం ప్రారంభించారు. చివరికి వైసీపీ అలా చేయడం కన్నా.. ఇలా ఎక్కువ మంది తన మనోభావాలు వైసీపీ విషయంలో దెబ్బ తినవని క్యారెక్టర్ ను అనుమానిస్తూండటంతో చివరికి జగన్ పేరు లేకుండా వైసీపీ పేరుతో ఓ ట్వీట్ చేశారు.
జీవీఎల్‌పై ఇలా అందరూ మనోభావాల పేరుతో విమర్శలు చేయడానికి కారణం గతంలో ఆయన టీడీపీ విషయంలో చేసిన ఓ అతి స్పందనే. అయ్యన్నపాత్రుడు ఓ టీడీపీ సమావేశంలో పొత్తుల గురించి చెబుతూ… రామాయణంలోనే ఓ సన్నివేశాన్ని వివరించారు. రావణుడిని వధించేటప్పుడు రాముడు ఉడత నుంచి కోతుల సాయం కూడా తీసుకున్నారని అయ్యన్న పాత్రుడు అన్నారు. అదే తరహాలో ఇప్పుడు కూడా జగన్ రెడ్డిని గద్దె దించడానికి అందరి సాయం తీసుకోవాలని, రాముడు బలవంతుడైనా, భగవంతుడైనా అందరి సాయం తీసుకున్నారని, అదే మాదిరిగా చంద్రబాబు కూడా తగిన నిర్ణయం సరైన సమయంలో తీసుకోవాలని సూచించారు. ఇది జీవీఎల్‌కు నచ్చలేదు.
వెంటనే పెద్ద ట్వీట్ పెట్టారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారని చంద్రబాబు, టీడీపీ క్షమామణ చెప్పాలన్నారు. జీవీఎల్ అతిని చూసి అందరూ ట్రోలింగ్ చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అసలు రామాయణాన్ని కోట్ చేసుకుంటే మనోభావాలు దెబ్బ తినడమేమిటని.. అసలు జీవీఎల్ ఎవడని అడిగారు. అప్పటి నుంచి ఆయనను నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇలా మనోభావాల పేరుతో స్పందించక తప్పడం లేదు.