బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న హఠాన్మరణం చెందారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో హఠాత్తుగా పడిపోయిన ఆయనను కుటుంబసభ్యులు పదహారో తేదీన యశోదా ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించిటన్లుగా వైద్యులు ప్రకటిచారు. సాయన్న ఐదు సార్లు కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్గ కాలం ఉన్న ఆయన గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో చేరారు. విజయం సాధించారు.
1994 ఎన్నికల్లో మొదటి సారి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆ తర్వాత1999. 2004లోనూ విజయం సాధించారు. 2009లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ రావు చేతిలో చాలా స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ 2014లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా సాయన్నకు పేరు ఉంది. ఆయన పనితీరు అన్ని రాజకీయ పార్టీల నేతలనూ మెప్పిస్తుంది.
నాలుగు రోజుల కిందట కూడా ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నాలుగు రోజుల్లోనే ఆయన కన్ను మూయడం పార్టీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.