హైదరాబాద్‌లో ఓ నాలుగేళ్ల పిల్లగాడు వీధి కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురి చేస్తోంది. సీసీ కెమెరా దృశ్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే… జరిగింది ఏమిటో తెలిసిన ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ వీడియోనూ చూసేందుకు సిద్ధపడటం లేదు. ఆ కుక్కలు ఆ పిల్లవాడి మీదకు ఎగబడుతున్న దశ్యాలు చూసి.. గుండె జారిపోతోంది. హే భగవాన్ అని అనుకోవడం తప్ప ఎవరూ ఏమీ చేయలేరు. చేయగలిగింది.. ఎవరైనా ఉన్నారా అంటే.. ఇలాంటి విపత్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాళ్లు.. అధికారులు… ప్రభుత్వం.
హైదరాబాద్ మెట్రో పాలిటన్ సిటీ. ప్రపంచపటంలో ప్రముఖ నగరం హైదరాబాద్. రంగు రంగలు భవనాలు.. అద్దాల మేడలు.. ఐటీ కంపెనీల వెలుగులు.. పబ్ లు..క్లబ్‌లు మాత్రమే కాదు.. అంతకు మించి బడుగల జీవనం ఉంది. అంతా ఓ వైపు వైట్ ఉంటే.. మరో వైపు బ్లాక్ ఉంది. నిజానికి ఈ బ్లాక్ 80శాతం ఉంటుంది. ఈ ఎనభై శాతంలోనే అతి తక్కువ జీతాలతో.. అరకొర వసతులతో జనం బతికేస్తూ ఉంటారు. ఇలాంటి చోట్లనే.. ఈ దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. దురదృష్టం ఏమిటో కానీ.. ఇలాంటి ప్రజలు ఉన్నచోట.. ఎలాంటి సౌకర్యాలు.. లేకపోయినా పర్వాలేదు సర్దుకుపోతారన్న ఉద్దేశంతో అధికారవర్గాలుంటున్నాయి. అదే అసలు విషాదం.
హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఇదీ అభివృద్ధి అని అని ఇప్పుడు గట్టిగా చెప్పుకోలేరు. ఏం చేశామని చెప్పుకున్నా.. ముందు ఈ పసిపిల్లాడి ప్రాణం నిలువునా ప్రశ్నిస్తుంది. ఇదేనా అభివృద్ధి అని నిలదీస్తుంది. చెప్పడానికి సమాధానం ఉండదు. వీధి కుక్కలు లేకుండా ఉంటాయా.. అని వితంత వాదపు సమాధానం చెబితే అది మనల్ని మనంకించ పర్చుకున్నట్లే. ఆ పిల్లాడి ప్రాణానికి విలువ ఇవ్వనట్లే.
హైదరాబాద్‌లో కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన పిల్లవాడు చేసిన తప్పేమీ లేదు. తప్పు ఒప్పులు తెలిసే వయసు కాదు. ఆ బిడ్డను పని దగ్గరకు తీసుకు వచ్చిన తండ్రిదీ తప్పేమీ లేదు. అలా రోడ్డు మీదకు వస్తే ఎగబడే హక్కు కుక్కలకేకాదు ఇతరుకలూ ఉందని అనుకునే పరిస్థితి లేదు. వీధి కుక్కల్ని నిర్మూలించమని ఎవరూ అడగరు. కానీ.. వాటి విషయంలో జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బిడ్డ పరస్థితి.. అనుభవించిన నరకాన్ని ఊహించుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. బిడ్డలున్న ఎవరైనా… జాగ్రత్తగా బిడ్డల్ని పొదివి పట్టుకునేంత భయంకరంగా ఆ దృశ్యాలు ఉన్నాయి.
ఏం జరిగినా ఇక జరగకుండా చూసుకుంటాం అని చెప్పడం రాజకీయ నాయకులకు కామన్. ఇప్పుడు కూడా మేయర్ తో సహా అదే చెబుతున్నారు. కానీ ఆ మాట మనసుల్లోనుంచి వస్తేనే విలువ ఉంటుంది. ఏం చేసినా.. ఆ బిడ్డ ప్రాణం మాత్రం ఈ ఘటనకు కారణమైన వారిని వెంటాడుతూనే ఉంటుంది.