భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మరోసారి సైలెంట్ అయ్యారు. గ సీఎం కేసీఆర్ తన పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 17వ తేదీ నుంచి జాతీయ రాజకీయాల్లో ఓ ఊపు తీసుకురావాలనుకున్నారు. అందుకే వేగంగా బడ్జెట్ ప్రక్రియను కూడా అసెంబ్లీలో పూర్తి చేశారు. అయితే కారణం ఏమిటో స్పష్టత లేదు కానీ.. సచివాలయ ప్రారంభోత్సవాన్ని బహిరంగసభను వాయిదా వేశారు. ఎన్నికల కోడ్ అడ్డంకి అనే కారణం చెప్పారు కానీ.. అది ఏ మాత్రం నమ్మశక్యంగా లేదన్న వాదన రాజకీయవర్గాల్లో ఉంది. ఓ
ఇటీవలి కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కేసీఆర్ ను కలిసే నేతల సంఖ్య కూడా తగ్గిపోయింది. పది రోజుల కిందట చత్తీస్ ఘడ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు వచ్చి కలిశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీతో కలవడం లేదా.. తన పార్టీని వీలీనం చేయడం చేస్తారని చెప్పుకున్నారు. ఈ వియంపైనా స్పష్టత లేదు. ఏపీకి బీఆర్ఎస్ అధ్యక్షుడ్ని ప్రకటించారు. ఒడిషాకు కూడా అధ్యక్షుడ్ని ప్రకటించారు. ఆ రెండు చోట్ల కార్యాలయాలను ప్రారంభించి భారీ బహిరంగసభలను ఏర్పాటు చేయాలనుకున్నరు. కానీ ఇంకా ఆ విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. ఏపీలో కానీ.. ఒడిషాలో కానీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల్ని ఖరారు చేసుకోలేదు. పార్టీ కార్యాలయాలను ఎంపిక చేసుకుని బహిరంగసభను వీలైనంత త్వరగా పెడితే పార్టీలో చేరికలు ఉంటాయని కొంత మంది నేతలు అంచనా వేస్తున్నరు.
మరో వైపు బీఆర్ఎస్ పార్టీ కర్ణాటకలో జేడీఎస్‌కు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని ప్రకటించింది. అయితే ఇప్పట వరకూ బీఆర్ఎస్ నేతలు ఇంకా కర్ణాటకలో రంగంలోకి దిగలేదు. అక్కడ పూర్తి స్థాయి రాజకీయ వాతావరణం ఏర్పడింది. అన్ని పార్టీలు ప్రచారాలు ప్రారంభించేశాయి. కానీ బీఆర్ఎస్ రంగంలోకి దిగలేదు. జాతీయ పార్టీపై కేసీఆర్ వ్యూహాల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.