ఈనాడు పత్రికలో పట్టాభినీ కొట్టారు అంటూ రెండు ఫోటోలను ఈనాడు ప్రచురించింది. అందులో ఒకటి చేయి చూపిస్తున్నది. రెండో కాలు గాయాలు. ఆ రెండో కాలు గాయాలి ఫోటో గతంలో దేవినేని అవినాష్ అనుచరుుల ఆయన ఇంటి నుంచి టీడీపీ ఆఫీసుకు వెళ్తున్న సమయంలో దారి కాసి కారుపై దాడి చేసిన సమయంలోనివి., ఆ ఫోటోలు టీడీపీ … పట్టాభిపై పోలీసులు దాడి చేసినవేనని వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేసింది. అయితే ఈనాడు దినపత్రిక జర్నలిస్టులు అవి నిన్నటివే అనుకుని వాటిని ప్రచురించారు. విషయం తెలిసిన తర్వాత తప్పు దిద్దుకున్నారు
మొదట ఈటీవీలో ఈ ఫోటో పొరపాటున ప్రచురితమైందని చెప్పారు. గురువారం కూడా వివరణ ప్రకటన చేశారు. అయితే ఈ ఫోటోను రామోజీరావే వేయించారన్నట్లుగా సాక్షి పత్రిక ప్రచారం చేస్తోంది. నిన్నటి నుంచి అదే పనిగా ప్రచారం చేస్తోంది. వివేకా హత్య కేసు విషయం తెలిసినా ఆ ఫోటో ఒకటి పాతది వేయడం గురించే రాస్తోంది. అయితే అంతర్గతంగా ఈ పొరపాటుపై ఈనాడు .. సాక్షి కన్నా సీరియస్ గా తీసుకుంది. యాజమాన్యం తీవ్ర స్థాయిలో ఆగ్రహం చెంది …విజయవాడ అమరావతి డెస్కులో డెస్క్ ఇంఛార్జి సహా మరో ఇద్దరు సబ్ ఎడిటర్లను ఉద్యోగాల నుంచీ తీసేసింది. సీనియర్లు అయిన వారు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.
అయితే ఇది ఈనాడు ప్రమాణాల విషయంలో ఎంత నిబద్ధత పాటిస్తుందో అన్నదానికి సూచికే అనుకోవచ్చు. అదే సాక్షిలో అయితే అడ్డగోలుగా ఇలాంటి అబద్దులు ప్రచారాలు యజమాన్యమే చేయిస్తుంది. చేయకపోతే ఉద్యోగాలు తొలగిస్తుంది. విలువలు పాటించడంలో ఉండే తేడా అదే అనుకోవచ్చు.