బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఏపీలో న్యూస్ పేపర్ పెట్టాలనుకుంటున్నారు. నమస్తే తెలంగాణ స్టైలలో నమస్తే ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ దగ్గర డబ్బులకు కొదువ లేదు. పేపర్ పెట్టాలనుకుంటే… జర్నలిస్టులను రిక్రూట్ చేసుకోవడం .. కొన్ని ప్రింటింగ్ యూనిట్లు పెడితే సరిపోతుది. అది రెండు, మూడు నెలల్లో పూర్తి చేయవచ్చు. లేదా ప్రింటింగ్ చేయించుకోవాలనుంటే.. సాక్షి ప్రింటింగ్ ప్రెస్లలో చేయించుకోవచ్చు. ఇలాంటి ప్రింటింగ్ వ్యాపారంలో సాక్షి రాటుదేలిపోయింది.
అయితే ప్రస్తుతం పత్రికా రంగం పూర్తి సంక్షోభంలో ఉంది. డబ్బులు పెట్టి పత్రిక కొనేవారు ఎవరూ లేరు. కొత్త తరం అసలు పత్రికలను పట్టుకోవడం లేదు. పాత తరం.. పేపర్లకు అలవాటు పడిన కొంత మంది మాత్రమే పత్రికలు కొంటున్నారు. వారు వారు అలవాటు పడిన పత్రికలకు కాకుండా ఇతర పత్రికలు కొనే పరిస్థితి ఉండదు. సాక్షి పత్రికలాగా లేకపోతే నమస్తే తెలంగాణలాగా బలవంతంగా ప్రజా సొమ్ము ఖర్చు చేసి అయినా ప్రజలకు అంటగట్టే స్కోప్ ఉండదు. తెలంగాణ సొమ్ములతో ఏపీ ప్రజలకు పత్రికను పంచలేరు.
మామూలుగా ఇప్పుడు అందరూ ఏదైనా మీడియా వెంచర్ ప్రారంభించాలంటే అసలు పత్రికలను పరిగణనలోకి తీుకోవడం లేదు. దీనికి కారణం ఖర్చు .. పెట్టుబడి చాలా ఎక్కువ.. ఆదారణ కూడా తగ్గిపోవడం మరో కారణం. అదే చానల్ లేదా.. డిజిటల్ మీడియా అయితే సింపుల్గా అయిపోతుందని అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం పత్రికకే మొగ్గుచూపుతున్నారు. దీనికి సంబందించి లీకు మాత్రమే ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చింది. అసలు ఎక్కడి వరకూ వర్కవుట్ చేశారన్నది తేలాల్సి ఉంది.