సొంత కుటుంబసభ్యులను నిర్దాక్షిణ్యంగా చంపేసి పక్క పార్టీ మీద తోసేసి ఆస్కార్ లెవల్ నటనను చూపించి కన్నీళ్లు పెట్టుకునే వాళ్లను ఏమంటారు ?. ఇలాంటి వారిని క్రూరమృగాలతో కూడా పోల్చలేం.. ఎందుకంటే క్రూరమృగాలు తాము చంపేసి వేరే వాళ్ల మీదకు తోసేసే ప్రయత్నం చేయవు. చేసేది దర్జాగా చేస్తాయి. కానీ మనిషి రూప మేక వన్నె క్రూరమృగాలు మాత్రం ఈ విషయంలో రాజీ పడబోవు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయం ఇదే. గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ తరపున టిక్కెట్లు ప్రకటించడానికి రెండు రోజుల ముందు మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, అత్యంత పవర్ ఫుల్ ఫ్యామిలీల్లో ఒకటి అయిన వైఎస్ ఫ్యామిలీలో కుటుంబసభ్యుడు.. ఇతరులెవరైనా అడుగు పెట్టడానికి కూడా సాహసించని యెదుగూరి సందింటి కుటుంబాలు ఉండే పులివెందుల కాలనీలోని ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. మొదట్లో గుండె పోటు అని నమ్మించడానికి ప్రచారం చేసినా తర్వాత దారుణ హత్య అని తేలింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఓ కుటుంబం చేస్తున్న రాజకీయం.. ఇతరుల్ని బలి చేసేందుకు దేనికైనా వెరువని మనస్థత్వం చూస్తున్న వారికి.. ఇంత ప్రమాదకర మనషులు కూడా ఉంటారా అని ఆశ్చర్య పోక తప్పని పరిస్థితులు.
70 ఏళ్ల వృద్ధుడిని అంత దారుణంగా చంపుతారా ?
వైఎస్ వివేకానందరెడ్డిని ఎలా చంపారు ? అత్యంత భయానకం. మూడు రోజుల కిందట అంబర్ పేటలో ఓ చిన్న పిల్లవాడ్ని మూడు కుక్కలు రౌండప్ చేసి దారుణంగా చంపేశాయి. ఆ దృశ్యాలు చూసి భయపడని వారు ఉండరు. అంత కంటే దారుణంగా వివేకానందరెడ్డిని చంపారు. తలపై గొడ్డలతో మూడు సార్లు నరికారు. అసలు ఎవరికైనా తలపై కొట్టాలంటేనే భయం వేస్తుంది.. కానీ గొడ్డలితో నరకడమే కాదు.. వెంటనే.. తనను డ్రైవర్ చంపేశాడని ఓ లేఖ కూడా రాయించారు. తర్వాత బాత్ రూంలోకి తీసుకెళ్లి మరిన్నిపోట్లు వేశారు. మొత్త్ం ఏడో.. పదకొండో గొడ్డలి పోట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఓ ముఖ్యమంత్రి సోదరుడికి ఇంత దారుణమైన మృత్యువు వస్తుందని ఎవరూ అనుకోలేదు. అనుకోరు కూడా. వైఎస్ కుటుంబం ఫ్యాక్షన్ చరిత్ర కారణంగా వైఎస్ వివేకానందరెడ్డికి ముప్పు వచ్చిందని ఎవరూ అనుకోరు. ఎందుకంటే.. ఆ కుటుంబంపై ఉన్న ఇమేజ్‌కు భిన్నమైన మనస్థత్వం వైఎస్ వివేకానందరెడ్డి. ఆయన చాలా అంటే చాలా సౌమ్యుడు. ఆయన కోప్పడటం ఎప్పుడూ చూసి ఉండరు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఇంటి ముందు తనను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలపై మీసం మెలేశారు.. అదొక్కటే ఆయనలోని కోపం యాంగిల్ చూపించింది. ప్రతీ సారి సౌమ్యంగానే ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబడి సొంత పార్టీ చేతిలో దారుణంగా మోసపోయినా ఆయన పెద్దగా ఆవేశానికి లోను కాలేదు. ఇలాంటి వ్యక్తిని నరికి నరికి చంపారు. అంతేనా కామ్‌గా ఆయన గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేయాలని చూశారు. చేతలో ఉన్న మీడియా..సోషల్ మీడియాతో అదే పని చేశారు. మృతదేహానికి కట్లు కట్టించి.. ఎలాంటి పోస్టుమార్టం లేకుండా ఖననం చేయాలనుకున్నారు. కానీ అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చాకచక్యంగా వ్యవహరించడంతో మొత్తం గుట్టు రట్టయింది. ఆ కోపంతోనే వెంకటేశ్వరరావుకు ఎలాంటి పరిస్థితి కల్పించారో కళ్ల ముందు ఉండనే ఉంది. చివరికి గుండెపోటు కాదు హత్య అని తేలింది. కానీ ఏం చేశారు.. అప్పటి వరకూ సంతాపం ప్రకటించి.. హత్య అని తెలియగానే.. ఏ మాత్రం ఆలోచన లేకుండా ప్రత్యర్థులపైకి నెట్టేసి.. ఆస్కార్ లెవర్ దీన ముఖాలతో.. కన్నీటితో రంగంలోకి దిగిపోయారు. దీనికి తోడు కోడికత్తి డ్రామా… మొత్తంగా ఈ సెంటిమెంట్‌తోనే ప్రజల ఓట్లు కొల్లగొట్టారు.
మొత్తం తెలిసీ చంద్రబాబు మీదకు తోసేయాలని కుట్ర !
వివేకా హత్య జరిగిన క్షణాల్లోనే ఆ విషయం అవినాష్ రెడ్డి ద్వారా అప్పటి ప్రతిపక్ష నేత జగన్, ఆయన సతీమణి భారతిలకు అవినాష్ రెడ్డి చెప్పారు. నిజానికి అవినాష్ రెడ్డి ఇలా చెప్పడానికి ముందు హత్య జరిగిందని ఎవరికీ తెలియదు. హత్య చేసిన వారికి.. చేయించిన వారికి.. ప్లాన్ చేయించిన వారికి తప్ప. ఉదయం ఆరు గంటల సమయంలో పనిమనిషి వచ్చి చూసినప్పుడు మాత్రమే తెలిసిందని అందరూ కథలు చెప్పడం ప్రారంభించారు. అదే నిజమైతే మూడు గంటలకు ఎలా ఫోన్ చేస్తారు ?. ఏం కథలు చెప్పినా సీబీఐ మొత్తం స్టోరీ, స్క్రీన్ ప్లేను బయటకు తీస్తోంది. ఇక రచయిత కూడా వెలుగులోకి వస్తారు. అయితే ఇంత పచ్చిగా తామే హత్య చేసి.. పక్కనోళ్లపై ఏడ్చి.. ఓట్లు దండుకున్న వారి మానసిక స్థితిని గుర్తు చేసుకుంటే.. ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఎవరిపైనైనా చిన్న దెబ్బకొట్టాలంటే… అందరూ బాధపడతారు. ఎందుకు కొట్టాలని ఆలోస్తారు. కానీ మనుషుల ప్రాణాల్ని అలవోకగా తీసే హంతకులకు మాత్రం ఇలాంటి ఫీలింగ్ ఉండదు. అంతే కాదు వారు అలా చంపి.. ఇతరులపై నిందలు వేయడానికి ఏ మాత్రం ఆలోచించరు. ఇలాంటి విపరీత మనస్థత్వం కారమంగానే గుండెపోటు కాదని.. గొడ్డలి పోటు అని బయటకు రాగానే.. చంద్రబాబుతో పాటు కడపలోని టీడీపీ నేతలపై నిందలేయడానికి పక్కా స్చెచ్ అమలు చేశారు. నారాసుర రక్త చరిత్ర అనిపెద్ద కథ రాసి సాక్షి మీడియాలో ప్రింట్ చేశారు. చంద్రబాబు చేతిలో వేట కత్తిని గ్రాఫిక్స్ ద్వారా పెట్టారు. అన్నీ చంద్రబాబు హయాంలో జరిగాయని ప్రజల్ని నమ్మించారు. ఓట్లు గుద్దించుకున్నారు.
చంద్రబాబు కాకపోతే వివేకా కుమార్తె , అల్లుడినైనా ఇరికించాలని కుట్ర !
రాజకీయ ప్రత్యర్థిని ఇరికించలేక.. వాస్తవాలు బయటకు వస్తాయని.. చివరికి న్యాయం కోసం పోరాడుతున్న… కుమార్తె, అల్లుడినైనా ఇరికించాలని మహా ప్లాన్ వేశారు. ఆ కుమార్తె ఎవరో కాదు. తన చెల్లలు, తనతో పాటు పెరిగిన చెల్లలు. ఆమె వివాహం.. సీఎం జగన్ వివాహం ఒకే రోజు.. ఒకే వేదికపై జరిగాయి. అంత దగ్గరి బంధువును కూడా తాను చేసిన హత్యలో ఇరికించేసి తాను బయటపడాలనుకున్నారు. దానికి తగ్గట్లుగా ఆరోపణలు ప్రారంభించారు. వైఎస్ వివేకాకు రంకు అంటగట్టి.. రెండో భార్య..రండో బిడ్డ ఆస్తి తగాదాలు అంటూ ప్రారంభించారు. నిజంగా ప్రభుత్వ అధీనంలోని సిట్ ఇంకొంత కాలం విచారణ జరపి ఉంటే… వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు సూత్రధారులు వాళ్లేనంటూ వైఎస్ సునీతను.. ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిని జైల్లో వేసి తాము చేతులు దులుపుకుని ఉండేవారు. ఎందుకంటే పోలీసుల నీతి, నిజాయితీ ఎలా ఉందో.. మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. హంతకలకూ మద్దతు పలకడం.. దాడులు, దౌర్జన్యాలు చేసే వారికి అండగా ఉండటం.. బాధితులపై కేసులు పెట్టి జైలుకు పంపడం.. ఏపీ రాజ్యాంగంలో సర్వసాధారణం. సాక్ష్యాల్లేని కేసులు ఎన్నిపెట్టి అరెస్ట్ చేశారో లెక్కే లేదు. సాక్ష్యాలు లేకపోయినా… ఏపీలో ఎంత మందిని అరెస్ట్ చేశారో లెక్కే లేదు. వారు అరెస్ట్ చేయాలనుకుంటే పోలీసులు.. చట్టాలు అనేవి పని చేయవు. ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టే … సీబీఐ విచారణ కోసం వైఎస్ వివేకా కుమార్తె న్యాయపోరాటం ఉంటారు. లేకపోతే ఈ పాటికి ఆమె బలి పశువు అయి ఉండేది. విశేషం ఏమింటంటే ఇప్పటికీ ఆమెపైనే గురిపెట్టి ప్రచారం చేస్తున్నారు. సాక్షి పత్రికలో రాయిస్తున్నారు. ఇతర నేతలతో ఆరోపణలు చేయిస్తున్నారు.ఈ హత్య ఘటనపై కొడాలి నాని వంటి వారు మాట్లాడుతున్న మాటలు వింటూంటే.. ఇంత భయంకరమైన మనుషుల మధ్య మనం బతుకుతున్నామా అని అందరూ ఆశ్చర్యపోక తప్పదు.
చేధించదల్చుకుంటే ఇది అసలు కేసేనా ?
చిన్న వెంట్రుకను ఆధారంగా వదిలిపెట్టి వెస్తేనే నిందితులెవరో వారంలో కనిపెట్టేస్తున్నారు పోలీసులు. ఇదేమీ సినిమాల్లో జరగడం కాదు. మన పోలీసులు చేధించిన ఎన్నో నేరాలు ఎంతో క్లిష్టమైనవి.కానీ వైఎస్ వివేకా హత్య కేసులో కొన్ని వందల క్లూస్ ఉన్నాయి. అరగంటలో నిందితుల్ని.. హత్యలకు ప్రోత్సహించిన వారిని పట్టుకుని లోపల వేయడానికి అవసరమైనంత సరంజామా ఉంది. సాక్ష్యాలు తుడిచేయడానికి ప్రయత్నించిన వాడే అసలైన నేరస్తుడు. దొరికిపోతామన్న భయం లేకపోతే ఎందుకు సాక్ష్యాలు తుడిచేస్తాడు ?. వివేకా హత్యకేసులో సాక్ష్యాలు తుడిచేయడం మాత్రమే కాదు అసలు అత్యంత దారుణమైన హత్యను గుండెపోటుగా ప్రచారం చేశారు. అదే నిజం అని నమ్మించే ప ్రయత్నం చేశారు. హత్య అని తెలిసి కూడా ఎందుకు ఇలా ప్రచారం చేశారో అర్థం కాదా ? ఇక సాక్ష్యాల గురించి ఈ టెక్నికల్ గా అడ్వాన్స్ డ్ గా ఉన్న ప్రపంచంలో అర్థం దొరకవా ? తాజాగా సీబీఐ గూగుల్ టేకౌట్ అనే టూల్ ద్వారా ఎవరెవరు ఎప్పుడు ఎక్కడ ఉన్నారో కనిపెట్టేసిందని చెబుతున్నారు. నిజానికి అప్పట్లోనే కాల్ రికార్డులు బయట పెడితే మొత్తంగుట్టు బయటపడేది. సాక్ష్యాలు తారుమారు చేసిన వారిని.. మృతదేహాలకు కుట్లు వేసిన పట్టుకుని పోలీసు మార్క్ విచారణ జరిపితే గుట్టు రట్టయ్యేది. కానీ అప్పట్లోనే వ్యవస్థలన్నీ నేరస్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈసీ కడప ఎస్పీని బదిలీ చేసింది. అసలు హై ప్రోఫైల్ కేసు విచారిస్తున్న కేసు ఎస్పీని ఈసీ బదిలీ చేయడం ఏమిటి ? అసలు ఎలా అలా ఆదేశిస్తారన్నదానిపై ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గలేదు. తర్వాత పాలన కూడా ఈసీ నియమించిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేతుల్లోకి వెళ్లిపోయింది. తర్వాత అసలు సూత్రధారులే గద్దెనెక్కడంతో కథ కంచికి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. కానీ తమను బలిపశువుల్ని చేస్తున్నారని గుర్తించిన మరుక్షణం బాధితులు కాకుండా వైఎస్ వివేకా కుమార్తె, అల్లుడు బయటపడ్డారు. ఇప్పుడు అసలు నిందితులకు శిక్షపడేలా చేయడమే మిగిలింది.
ఇలాంటి వారిని మొదట ప్రజలే శిక్షించాలి !
గత ఎన్నికలకు ముందు చాలా డ్రామాలు జరిగాయి. కోడి కత్తితో గీత పెట్టించుకుని హైదరాబాద్ వెళ్లి అక్కడ ఆస్పత్రిలో చేరి ఆడిన నాటకం వెనుక ఎంత కుట్ర ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ కోడి కత్తి గాయం చేసిన వ్యక్తిని బయటకు రానీయడం లేదు. ఆ గాయానికి చికిత్స చేసిన డాక్టర్ కు పెద్దపదవి ఇచ్చి లక్షల జీతం ఇస్తున్నారు. ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత .. కుటుంబం మొత్తం ప్రదర్శించిన నటనా నైపుణ్యం చూసి అందరూ అచ్చెరువొందారు. నిజమేననుకున్నారు. కానీ.. ఇప్పుడు నిజాలను సీబీఐ కళ్ల ముందు పెడుతోంది. ప్రజలు ఎంత తప్పు చేశారో స్పష్టంగా సీబీఐ విశదీకరిస్తోంది. గత నాలుగేళ్లుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూసి.. ప్రజలు కూడా రియలైజ్ అవుతున్నారు. కానీ అసలు పశ్చాత్తాపమే లేకుండా తాము చేసిన నేరాల్ని ఇతరులపై మోపి అయినా సరే తాము అనుకున్న రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇలాంటి మేక వన్నె క్రూరమృగాలను మొదట ప్రజలు శిక్షించాలి… ప్రజలు వేసే శిక్షే అత్యంత బలమైనది. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే.. పాముకు పాలు పోసినట్లే. పాలు పోశాం కదా మనల్ని కరవదని అనుకుంటే.. కాటేసిన తర్వాత చింతించాల్సిందే. ఇప్పుడు చాయిస్ ప్రజల చేతుల్లోనే ఉంది.