సీబీఐ మొత్తం గుట్టు విప్పి చేతిలో పెడుతున్నా… సజ్జల రామకృష్ణారెడ్డికి కవర్ డ్రైవ్లు ఆడక తప్పడం లేదు. ఈ అంశంలో సీబీఐ వాదన అబద్దమన చెప్పేందుకు చిత్ర విచిత్రమైన లాజిక్కులతో సాక్షి పత్రికలో పేజీలకు పేజీలు రాయిస్తున్న సజ్జల … అదే విషయాన్ని మీడియా ముందుకు వచ్చి తబడకుండా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. సీబీఐ మీద ఆరోపణలు చేస్తున్నారు. వివేకాను మర్డర్ చేశాడని చెబుతున్న అవినాష్ రెడ్డిపై ఆధారాలు ఉండి ఉంటే ఇన్ని కుట్రలు జరగవని చెప్పుకొచ్చారు. సీబీఐ సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన అఫిడవిట్ అంతా ఓ అబద్దమని చెప్పుకొచ్చింది. గూగుల్ లో ఏమొచ్చింది అనేది తెలియదని చెప్పుకొచ్చారు.
తెలుగుదేశం పార్టీ కోరుకున్న విధంగా సీబీఐ దర్యాప్తు జరుగుతోందని.. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగకపోగా తప్పుడు రాతలు రాయిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. సీబీఐ రిపోర్టులో ఉన్నదే మీడియా చెప్పింది. కాదంటే.. పత్రికలో ఖండింుకునేవారు. కానీ సీబీఐ రిపోర్టు ప్రజలకు అర్థం కాదు కాబట్టి.. తెలుగులో రాసిన మీడియా సంస్థలపై ఆయన అసహనం ఫీలవుతున్నారు. అటు సీబీఐ అఫిడవిట్.. ఇటు మీడియాలో రాతలు అంతా ఒక కో ఆర్డినేషన్ తో జరుగుతోందని చెప్పుకొచ్చారు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ అన్ని మీడియా సంస్థలకు అందింది. జగన్కు నొప్పి తెలియకూడదు అనుకున్న సంస్థలు రాయలేదు.. ప్రసారం చేయలేదు. రాసినవి మాత్రం.. సీబీఐతో మాట్లాడుకుని రాశారని సజ్జల చెప్పుకొస్తున్నారు.
బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి పాత్రపై ఆధారాలున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు.. అన్ని ఆధారాలుంటే.. కోర్టు అసలు విచారణ చేయడం లేదని.. ఆగ్రహించి.. సీబీైఐకి ఇచ్చే వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నది సజ్జలకే తెలియాలి. కామెడీ ఏమిటంటే.. వివేకా హత్య మాత్రం ఘోరంగా జరిగిందని ఆయన చెబుతున్నారు. నేరస్తులు పట్టుబడాలని అంటున్నారు. అయితే నేరస్తుల్ని పట్టుకుంటున్నసీబీఐని మాత్రం తప్పు పడుతున్నారు. తాము చెబుతున్న వారినే అరెస్ట్ చేయాలని.. తాము చెప్పిందే దర్యాప్తు చేయాలన్నట్లుగా సజ్జల తీరు ఉంది. కారణం ఏదైనా వివేకా హత్య కేసులరో సజ్జల .. జగన్ ను మెప్పించేలా కవర్ డ్రైవ్ చేయలేకపోతున్నారు. ఈ అసహనం ఆయనలోనూ కనిపిస్తోంది.