ఖమ్మం సభ తర్వాత తెలంగాణ టీడీపీ తర్వాత ఏం చేయబోతోందన్న దానిపై ఆసక్తి ఏర్పడింది. ఇప్పుడు ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఖమ్మం సభ తర్వాత దాదాపుగా ప్రతీ నియోజకవర్గంలోనూ టీడీపీ సానుభూతిపరుల గ్రూప్ రెడీ అయింది. సోషల్ మీడియాలో గ్రూపులు క్రియేట్ చేసి.. రోడ్ల మీదకు రావడం ప్రారంభించారు. అయితే వీరందర్నీ సమన్వయం చేసే వ్యవస్థ మాత్రం ఇంకా కనిపించలేదు. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ ఇంటింటికి తెలుగుదేశం పేరుతో అందరూ కలిపి ఒక ేకార్యక్రమం నిర్వహించేలా ప్లాన్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఈ కిట్లను పార్టీ నేతలకు పంపిణీ చేయిచారు.
టీడీపీకి పూర్వవైభవం తీసుకురావటానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని, టీడీపీ నేతలంతా నెలరోజుల పాటు గ్రామాలు, బస్తీల్లోనే ఉండాలన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా టీడీపీని బలోపేతం చేస్తామని, టీడీపీలో చేరికకు పలువురు ఇతర పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారని కాసాని జ్ఞానేశ్వర ్చెబుతున్నారు. తెలంగాణ గడ్డపైనే ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని స్థాపించారు. యువత, మహిళలకు టీడీపీ మాత్రమే పెద్దపీట వేసింది. సమిష్టిగా కృషిచేసి టి.టీడీపీకి పూర్వవైభవం తేవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
సంపద సృష్టించడం, ఉపాధి కల్పించడం,..అభివృద్ధి చేయడమే టీడీపీ ధ్యేయం. సంపద సృష్టించడమెంత ముఖ్యమో, పేదలకు అందించడం అంతే ముఖ్యం. టీడీపీ ఎక్కడ ఉంది అనేవారికి ఖమ్మం సభే సమాధానం. ఇక్కడికి వచ్చి చూస్తే టీడీపీ ఎక్కడ ఉందో కనిపిస్తోంది. తెలుగువారు ఎక్కడున్నా వారికోసం టీడీపీ పనిచేస్తుంది. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుంది. కాసాని నేతృత్వంలో టి.టీడీపీ పరుగులు పెడుతోంది. తెలంగాణలో మొదటి సీటు నాయిబ్రాహ్మణులకు..రెండో సీటు రజకులకు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పేదలను నాయకులుగా ప్రమోట్ చేసిన పార్టీ టీడీపీ మాత్రమే. ప్రజల్లో ఉన్న నాయకులను మాత్రమే పార్టీ గౌరవిస్తోంది. ఎన్టీఆర్ భవన్ చుట్టూ కాకుండా.. నేతలు గ్రామాల్లో తిరగాలి టీడీపీని కాపాడుకోవడం అవసరమని చంద్రబాబు హితబోధ చేశారు.
టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మార్చి 29న పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగసభ నిర్వహించనున్నారు.