ముఖ్యమంత్రిగా జగన్ తాను ఏం చేస్తున్నారో అవుటాఫ్ బాక్స్ ఆలోచించలేనంత స్థాయికి వెళ్లిపోతున్నారు. పూర్తి స్థాయిలో అన్ని అత్యున్నత వ్యవస్థల్ని ధిక్కరించేలా తాను మోనార్క్ అన్నట్లుగా వ్యవహరించాలని రాజధాని విషయంలో నిర్ణయించుకున్నారు. ఉగాది నుంచి వారంలో రెండు రోజుల పాటు విశాఖ నుంచి పరిపాలన చేయాలని జగన్ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. నాలుగు రోజులు అమరావతిలో ఉంటారు. ఇందులో ఓ రోజు ఆదివారం. మరో రోజు… పల్లెనిద్రకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు.
అంటే వారంలో రెండు రోజులు విశాఖ నుంచి పరిపాలన చేసి.. ఆ తర్వతా ఒక్క రోజు పల్లె నిద్ర చేసి… మరో నాలుగు రోజులు అమరావతి నుంచి పాలన చేస్తారు. విశాఖ రాజధానిగా చేస్తున్నామని చెప్పడానికి ఈ ప్రయత్నమన్నమాట. అసలు రాజ్యాంగపరంగా.. చట్ట పరంగా వెసులుబాటే లేదు. జగన్ మరోసారి గెలిచినా ఆయన రాజధానిని మార్చలేరు. రాజ్యాంగంలో రాజధాని అనే పేరే లేదని వాదించి చట్ట విరుద్ధంగా ఆయన విశాఖకు మకాం మార్చగలరు. ఆ చట్ట విరుద్ధ పనిని ఇప్పుడే చేయాలనుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఈ విశాఖ, అమరావతి, పల్లె నిద్రలపై ఆయన అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మూడు రాజధానులు ఉండవని జగన్ ప్రకటించే అవకాశం ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని కర్నూలులో హైకోర్టు పెడతాం కానీ అది న్యాయరాజధాని కాదని చెప్పే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా ఎన్నికలకు వెళ్లబోతున్న సమయంలో… రాజధానితో చేతికి వచ్చిన రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేసి.. ఆయన అదే తన ఘనత అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.