గోవా బ్యూటీ ఇలియానా కాలం కలిసి రావట్లేదు అన్నది అందరికి తెలిసిన విషయమే.. సౌత్ లో స్టార్ ఇమేజ్ సంపాధించిన అమ్మడు చెప్పా పెట్టకుండా బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ ఎంత ప్రయత్నించినా లాభం లేక డీలా పడ్డది. 2014లో హ్యాపీ ఎండింగ్ లో సైఫ్ ఆలి ఖాన్ తో నటించిన ఆమె కెరియర్ అక్కడ దాదాపు ఎండ్ కార్డ్ పడ్డట్టే అనిపించింది.
ఇక అక్కడ నుండి తనకు సూపర్ క్రేజ్ తెచ్చిన సౌత్ సినిమాలపై ముఖ్యంగా తెలుగు సినిమాలపై కన్నేసిన ఇలియానా ఇక్కడ అవకాశాలు వచ్చేలా ఉన్నా వాటిని రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేసి మిస్ చేసుకుంది. ఇక కెరియర్ దాదాపు ముగిసినట్టే అనుకుందో ఏమో తన బోయ్ ఫ్రెండ్ టేకింగ్ లో రకరకాల ఫోటో షూట్స్ రిలీజ్ చేస్తుంది.
ఆ ఫోటో షూట్ ల ప్రభావమో మరింకేదో తెలియదు కాని అమ్మడికి బాలీవుడ్ లో ఓ ఆఫర్ వచ్చింది. బీ టౌన్ యూత్ స్టార్ జాకీ భగ్నాని సినిమాలో అవకాశం రాగా దానికోసం కూడా దర్శక నిర్మాతలను భయపడే రేంజ్ లో ఇల్లి బేబ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. అంత ఇచ్చుకోలేమని చెప్పి చిన్నగా బ్యూటీని సైడ్ చేసి వేరే భామ కోసం వేట మొదలుపెట్టారట. మరి వచ్చిన అవకాశాలను కూడా చేజేతులా మిస్ చేసుకుంటున్న ఇలియానాకి ఇలానే ఉంటే ఆఫర్ లు రావడం కూడా కష్టమే అని చెప్పాలి.