వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రాజకీయ పెద్దల పాత్రపై లోతైన దర్యాప్తు జరుగుతోందని… ఇలాంటి దశలో సునీల్ యాదవ్కు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. సునీల్ కుమార్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకుందని కోర్టుకు వివరించింది. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరుగుతున్న సమయంలో బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. నిందితుల స్వేచ్ఛ కంటే సాక్షుల భద్రత, పాదర్శక దర్యాప్తు ముఖ్యమని ధర్మాసనం అభిప్రాయపడింది. బెయిల్ ను తిరస్కరించింది.
తెలంగాణ హైకోర్టులో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లో విషయాలు ఇప్పటికే సంచలనం అయ్యాయి. సునీల్ యాదవ్ కోణంలో ఆయన ఎంత తీవ్ర నేరం చేశాడో ఎలా హత్యలో భాగస్వామో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. హత్య ఎలా చేశారు.. ఎవరు చేయింంచారన్నది కూడా స్పష్టంగా ఉంది. హత్య జరిగిన సమయంలో జరిగిన ఫోన్ కాల్స్ గుట్టు అసలు మనిషి రూప రాక్షసుల్ని బయటకు తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సునీల్ యాదవ్ కోణంలోనే ఈ అఫిడవిట్ దాఖలు చేశారు.
వివేకా హత్యను గుండెపోటుగా చెప్పడమే కాకుండా హత్యగా బయటపడిన తరవాత చంద్రబాబు చేశాడని.. ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలు చేశారంటూ… ఏ మాత్రం సిగ్గుపడకుండా … సంబంధం లేని వాళ్ల మీదకు తోసేసే ప్రయత్నాన్ని చేశారు. అది కుదరకపోయే సరి చివరికి వివేకా కుమార్తె, అల్లుడినీ ఇరికించాలని చూశారు. మరో వైపు ఈ కేసులో ఇప్పటి వరకూ ఏ వన్ నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పైనా తెలంగాణ హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది.