ఫామ్ హౌస్ కేసు సీబీఐ చేతికి వెళ్లి చాలా కాలం అయింది. కానీ ఇంత వరకూ సీబీఐ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కనీసం కేసు నమోదు చేయలేదు. కేసు ఫైల్స్ కోసం తెలంగాణ సీఎస్ కు ఆరేడు సార్లు లేఖలు రాశారు . అటు వైపు నుంచి సమాధానం రాకపోవడంతో సైలెంట్ అయ్యారు. కానీ కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడానికి కూడా ప్రయత్నించడం లేదు. . హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లింది తెలంగాణ ప్రభుత్వం. సుప్రీంకోర్టు కూడా స్టే విధించడానికి ఆసక్తి చూపించడం లేదు. అయితే విచారణ ముగించలేదు. సోమవారం ఈ కేసుపై విచారణ జరిగింది కానీ.. కేసీఆర్పై న్యాయమూర్తి అసంతృప్తితోనే ముగిసింది.
తదుపరి విచారణ ఎప్పుడన్నది క్లారిటీ లేదు. సీజేఐ బెంచ్ ముందుకు రిఫర్ చేశారు. ఎప్పుడు విచారణ జరుగుతుందో చెప్పడం కష్టం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఆరోపణ… సీబీఐ చేతికి కేసు వెళ్తే.. సాక్ష్యాలను ధ్వంసం చేస్తారని ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వ తరపు లాయర్ సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. అందుకే దూకుడు చూపించకుండా సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాతే రంగంలోకి దిగితే… అనవసర వివాదాలు రాకుండా ఉటాయని సీబీఐ అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో మాత్రం మరో రకమైన చర్చ జరుగుతోంది.
ఈ కేసులో బీజేపీలో పెద్ద నేతల్ని.. చివరికి అమిత్ షాకు కూడా నోటీసులు ఇస్తామని ప్రచారం చేశారని.. ఈ కేసును తేలికగా తీసుకునే ప్రశ్నే లేదని అంటున్నారు. అయితే ఇంకా న్యాయపరమైన పోరాటం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నందన.. ఇక ఆప్షన్ లేనప్పుడు ప్రారంభిస్తే ఆటంకాలు రావని అంటున్నారు. మొత్తానికి ఈ ఫామ్ హౌస్ కేసు సైలెంటయినా… దూకుడుగా విచారణ జరిగినా సంచలనాలే నమోదయ్యే అవకాశం ఉంది.