టీవీ9కి ఎవరూ దొరకలేదో.. లేకపోతే దొరికినా ఎలా పడితే అలా టీఆర్పీ రేటింగ్ల కోసం రెచ్చిపోవడం కుదరడం లేదేమో కానీ.. వీధి కుక్కల మీద పడిపోయింది. ఉన్న పళంగా వాటిని వధిస్తారా లేదా అన్నట్లుగా న్యూస్ ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ వీధికుక్కలు కరిచినట్లుగా తెలిసినా వెంటనే..అక్కడ టీవీ9 ప్రతినిధులు వాలిపోయి… సమీపంలో సీసీ ఫుటేజీ ఉంటే సేకరించి.. అసలు ఇలాంటి కుక్కలకు బతికే అర్హత ఉందా అన్నట్లుగా తీర్పు చెప్పేస్తున్నారు.
నోరు లేని మూగ జీవాలు అన్నీ.. అలాగే వ్యవహరిస్తాయన్నట్లుగా టీవీ9 తీరు ఉండటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. బలమైన వర్గాల చేతిలో పావుగా మారి… బలహీను ల స్వరాన్ని ఇప్పటికే వినిపించడం మానేసి.. రాజకీయ కుట్రల్లో ప్రచార భాగస్వామి అవుతున్న టీవీ9 ఇప్పుడు.. నిజంగానే నోరు లేని మూగజీవాలపై పడటాన్ని ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. వీధి కుక్కల సమస్య ఇవాళ్టిది కాదు. అన్నింటిని వధించడంతో ఆగిపోదు.
కానీ ఏదో తాము హడావుడి చేయాలని.. వీధి కుక్కలు ప్రాణాంతంగా మారాయన్నట్లుగా ప్రయారిటీ ఇస్తున్నారు. మనుషులు అన్నీ తెలిసి ఒకరినొకరు చంపుకూంటూ ఉంటారు. హత్యలు చేసుకుంటారు. అలాగని మనుషులందరూ అలాగేఉండరు. అందుకే.. మూగ జీవాల పట్ల … కాస్త ఆలోచించి.. చేయాలి కానీ..వాటిని వధిస్తే తప్పు లేదన్న అభిప్రాయాన్ని అందరిలో కల్పించి.. అదే తాము సాధించిన విజయం అనుకుంటే అంత కంటే దిగజారిన జర్నలిజం ఏమీ ఉండదు. ఎందుకంటే తమ వాయిస్ వినిపించుకోవడానికి ఆ కుక్కలకు నోరు లేరు !