ఈ సంక్రాంతికి తన ఖాతాలో మరో హిట్ వేసుకొన్నాడు గోపీచంద్ మలినేని. బాలకృష్ణని `వీర సింహారెడ్డి`గా చూపించి.. అభిమానుల మనసుల్ని గెలుచుకొన్నాడు. అంతకు ముందు తీసిన `క్రాక్` సైతం కమర్షియల్గా పెద్ద విజయాన్ని అందుకొంది. దాంతో.. గోపీచంద్ మలినేనిపై అగ్ర హీరోల దృష్టి పడింది. గోపీ మాత్రం ఇప్పుడు మెగాస్టార్ వైపు చూస్తున్నాడు. తాజాగా.. చిరంజీవిని కలిసి.. ఓ కథ చెప్పినట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. అది.. చిరుకి సైతం బాగా నచ్చిందట. దీనిపై చిరంజీవి ఓ నిర్ణయం తీసుకోవాల్సివుంది. చిరు ప్రస్తుతం `భోళా శంకర్`తో బిజీగా ఉన్నాడు. ఆ తరవాత వెంకీ కుడుములతో ఓ ప్రాజెక్టు చేయాలి. ఆ సినిమా ఉందా? లేదా? అనేది ప్రస్తుతానికి డౌటుగా ఉంది. ఈ సినిమాపై ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేటూ లేదు. ఒక వేళ వెంకీ కుడుముల సినిమా లేకపోతే.. గోపీచంద్ సినిమా మొదలైపోతుంది. వెంకీ కుడుముల కూడా లైన్లో ఉంటే.. ఈ రెండు సినిమాల్నీ ఒకేసారి పట్టాలెక్కించే అవకాశం ఉంది. వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ రెండు చిత్రాలకూ చిరంజీవి సమాంతరంగానే డేట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే పంథా.. 2023లోనూ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.