ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కానీ అభ్యర్థులేరి ? అంటూ తెలంగాణ నాయకత్వాన్ని అమిత్ షా ప్రశ్నింంచినట్లుగా తెలుస్తోంది. అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించిన ఆయన ఇంటలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం… బలమైన అభ్యర్థులు లేరని.. చేరికలు ఎందుకు సాధ్యం కావడం లేదని క్లాస్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీకి అభ్యర్థులు లేరని దుష్ప్రచారం చేస్తున్నారని.. కానీ తాము అన్ని చోట్లా పోటీ చేస్తామని టీఎస్ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో .. అమిత్ షాతో భేటీ తర్వాత చెప్పుకొచ్చారు.
కానీ బీజేపీకి అభ్యర్థులు లేకపోవడం అనేది సమస్య కాదు. బీఫాం ఇస్తే పోటీ చేయడానికి వంద మంది రెడీగా ఉంటారు.కానీ ఇక్కడ బండి సంజయ్ భావిస్తున్నట్లుగా అభ్యర్థులు లేరని ప్రచారం జరగడం లేదు.. బలమైన అభ్యర్థులు లేరనే చెప్పుకుంటున్నారు. ఈ విషయం ఢిల్లీ బీజేపీ నేతలకూ అర్థమయింది. తెలంగాణ విషయంలో పట్టుదలగా ఉన్న అమిత్ షా.. ఉన్న పళంగా నేతల్ని పిలిపించి.. తీసుకున్న క్లాస్ .. అభ్యర్థుల కోసమేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణకు ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. కేసీఆర్ ముందస్తుకు వెళ్తే ఇంకా ముందే జరుగుతాయి. కానీ తెలంగాణ బీజేపీకి మధ్య బలమైన అభ్యర్థుల జాడ దొరకడం లేదు. ఇతర పార్టీల నేతలు వచ్చి చేరిన చోట బలమైన అభ్యర్థులు ఉన్నారు. అయితే అవి చాలా పరిమితంగా ఉన్నాయి. హుజూరాబాద్, మునుగోడు వంటి చోట్ల మాత్రమే ఈ బలం కనిపిస్తోంది. అది కూడా అభ్యర్థుల వల్లే వచ్చింది. ఇక ఇతర నేతలు ఎవరూ పెద్దగా చేరకపోవడంతో .. నియోజకవర్గాల్లో బలపడిన సందర్భాలు లేవు. ఇంతకు ముందు పార్టీలో చేరిన వారు..
చివరి క్షణం వరకూ బలమైననేతలురాకపోతే..ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్లలో టిక్కెట్లు రాని నేతల్ని ఆకర్షించి అప్పటికప్పుడు టిక్కెట్లు ఇచ్చి బరిలోకి నిలపడం తప్ప బీజేపీకి మరో ఆప్షన్ ఉండదు. అయితే ఇలా టిక్కెట్లు ఇస్తే.. ప్రజల్లో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. క్యాడర్ కూడా సహకరించదు. మెజార్టీ నియోజకవర్గాల్లో బీజేపీకి ఇటీవల క్యాడర్ పెరిగింది కానీ.. లీడర్లు మాత్రం దొరకడం లేదు. అందరూ ఎవరికి వారు తామే లీడర్లం అనుకుంటున్నారు