కర్ణాటక ఉద్యోగులు అదృష్టవంతులు. అక్కడి ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వానికి .. తమ ఉద్యోగుల ఉద్యమాన్ని తాకట్టు పెట్టలేదు. అనుకున్నది సాధించారు. సమ్మె చేసి.. ప్రభుత్వం మెడలు వంచారు. జీతాలు పెంచుకున్నారు. ఉద్యోగుల డిమాండ్లపై చాలా కాలంంగా స్పందించని కర్ణాటక సర్కార్… బుధవారం నిరవధిక సమ్మె ప్రారంభించడంతో రాష్ట్రప్రభుత్వం వెంటనే దిగి వచ్చింది. బేసిక్ సేలరీపై 17 శాతం పెంచడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సమ్మె ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఉద్యోగులు విరమించారు. జీతం పెంచుతున్న ఉత్తర్వులను కూడా మీడియా సమక్షంలో ఉద్యోగ సంఘం నేతలకు ప్రభుతవం ఇచ్చింది.
వేతన సవరణ, 40 శాతం ఐఆర్ పెంపు, ఎన్పిఎస్ రద్దు వంటి డిమాండ్లతో ఉద్యోగులుసమ్మె ప్రారంభించారు. విధులకుహాజరుకాకుండా కార్యాలయాలకుతాళాలు వేసి కార్యాలయాల ముందు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 68 రాష్ట్ర ప్రభుత్వ, దానిఅనుబంధ విభాగాలకుచెందిన సుమారు ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు సమ్మె లో పాల్గొన్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఉద్యోగుల ఆందోళన ఇబ్బందికరంగా మారడంతో ప్రభుత్వానికి దిగిరాక తప్పలేదు.
ఉద్యోగుల డిమాండ్ ప్రకారం జీతాల పెంపునతో పాటు పాత పెన్షన్ స్కీమ్ ను అమలు చేయడానికి ఉండే అవకాశాలపై అధ్యయనం చేయడానికి అదనపు ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీనిఏర్పాటు చేస్తునుట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం తరువాత ముఖ్యమంత్రి బసవరాజ్ బమ్మై ఈ విషయానిు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన మార్పులపైనా అధ్యయనం చేయాలనికమిటీకి తెలిపినట్లు వెల్లడించారు.
కర్ణాటకలో డీఏలు ఆపలేరు. డీఏలన్నీ ఇచ్చి… ఐఆర్ తగ్గించి.. ఏదో మంచి చేశామన్నట్లుగా కలరింగ్ ఇవ్వలేదు. జీపీఎఫ్ లు డ్రా చేసుకోలేదు. సీపీఎస్ రద్దు చేస్తామని మోసం చేయలేదు. కానీ అక్కడి ఉద్యోగ సంఘం నేతలు .. ఉద్యోగుల ప్రయోజనాల కోసమే కట్టుబడటంతో న్యాయం జరిగింది. కానీ ఏపీలో మాత్రం.. ఉద్యమాన్ని పీక్స్ కు తీసుకెళ్లి.. ఏమీ ఇవ్వకపోయినా ఇచ్చినట్లుగా ప్రకటించేసి పాలాభిషేకాలు చేసేసి. ఉద్యోగుల్ని నట్టేట ముంచారు.