మూడు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి గడ్డు పరిస్థితి ఉందని ప్రచారం జరిగిన్పటికీ… బీజేపీకి మెరుగైన ఫలితాలు వచ్చాయి. నాగాలాండ్, త్రిపురలో బీజేపీ కూటమి విజయం సాధించింది. మేఘాలయలో హంగ్ ఏర్పడింది. త్రిపురలో బీజేపీ కూటమి 33 స్థానాల్లో గెలిచింది. కాంగ్రె్స-వామపక్షాల కూటమి 14 సీట్లలో, మాణిక్య రాజవంశానికి చెందిన ప్రద్యోత్ బిక్రమ్ వర్మ సారథ్యంలోని తిప్రా మోథ పార్టీ 13 స్థానాల్లో గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ 31 కాగా 33 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ కూటమి వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చింది.
మేఘాలయలో హంగ్ ఏర్పడింది. ఆ రాష్ట్ర సీఎం కాన్రాడ్ సంగ్మాకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)కి అండగా నిలిచారు. 26 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 5, బీజేపీ 2 చోట్ల గెలిచాయి. ఇక్కడ కూడా బీజేపీ సంకీర్ణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం 37 స్థానాల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది. వాస్తవానికి… ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని అనుకున్నారు. కానీ మోదీ, షా మ్యాజిక్ పని చేసింది.
మరో వైపు ఎప్పుడు ఉపఎన్నికుల జరిగినా కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో బీజేపీ గత మూడు దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్న పుణె జిల్లాలోని కస్బాపేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది.. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే చనిపోయారు… ఆ సానుభూతి కూడా రాలేదు. బెంగాల్ లో జరిగిన ఒక అసెంబ్లీ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్కు చోు దక్కింది. తమిళనాడులో సిట్టింగ్ సీటులోనూ కాంగ్రెస్ గెలిచింది.