మంచు మనోజ్, మౌనికా రెడ్డిల వివాహం ఫిల్మ్ నగర్ లోని మంచు నిలయంలో కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం శుక్రవారం రాత్రి జరిగింది. ఈ వివాహ వేడుకలో మంచు మోహన్ బాబు, విష్ణు, విజయమ్మ, భూమా అఖిల ప్రియ దంపతులు, ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మనోజ్‌కు 2015లోనే ప్రణతీరెడ్డితో వివాహమైంది. అయితే పరస్పర అంగీకారంతో 2019లో వీరిద్దరూ విడిపోయారు. కుటుంబానికి సన్నిహితురాలు, తన స్నేహితురాలు భూమా మౌనికా రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోనున్నారని పచారం జరిగింది. వాటిని నిజం చేస్తూ ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికా రెడ్డి.