ఏపీలో మరే గ్రామంలోనూ లేనట్లుగా ఇప్పటంలోనే ప్రజలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారేమో కానీ ఇష్టం వచ్చినట్లుగా కూల్చివేతలు చేస్తున్నారు. గతంలో చేసిన కూల్చినేతల వ్యవహారం సంచలనం సృష్టిస్తే తాజాగా మరోసారి కూల్చివేతలు ప్రారంభించింది. 12 ఇళ్ల ప్రహరీ గోడలను నగరపాలక సంస్థ అధికారులు రెండు జేసీబీల సాయంతో కూలగొట్టారు. కూల్చివేతలను అడ్డుకొంటూ గ్రామస్థులు నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ఆందోళన వ్యక్తం చేశారు.
ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. గ్రామ సరిహద్దుల్లో పహారా పెట్టారు. గ్రామంలోకి వచ్చేవారిని తనిఖీ చేసి, వారి వివరాలను నమోదు చేసుకొని గ్రామంలోకి అనుమతిచ్చారు. కూల్చివేతలకు ముందుగానే నోటీసులు ఇచ్చామని రోడ్డు మీదకు ప్రహరీ గోడలు నిర్మించాలని వాటిని పడగొడుతున్నామని అధికారులు చెబుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామకంఠం భూముల్లో ఇలా రోడ్డ మీదకు ప్రహరీలు కట్టుకోవడం సహజమే. ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పటంలో మాత్రమే పగబట్టినట్లుగా కూల్చివేస్తూండటం వివాదం అవుతోంది. గతంలో ఈ గ్రామస్తులు కోర్టుకెళ్తే.. కోర్టు కూడా ఏకంగా లక్షకుపైగా జరిమానా విధించింది. దీంతో వారు న్యాయస్థానానికీ వెళ్లడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. పవన్ కల్యాణ్ సభకు స్థలాలు ఇవ్వడం వల్లనే ఇలా చేస్తున్నారని ఇప్పుడు మచిలీపట్నంలో నిర్వహించబోతున్న జనసేన ఆవిర్భావ సభకు అక్కడి రైతులు ఎవరైనా పొలాలు వారికీ ఇదే గతి పడుతుందన్న సంకేతాలను ఇక్కడి నుంచి పంపడానికే రెండో సారి కూల్చివేతలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.