ఓ వైపు టీఆర్ఎస్ పేరుతో … మాజీ టీఆర్ఎస్ నేతలు కొత్త పార్టీ పెట్టి రంగంలోకి దిగబోతున్నారన్న ప్రచారం ప్రారంభమైన వెంటనే.. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చారు. ప్రగతి భవన్లో ఈ నెల 9న మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమచారం. కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కొంత కాలంగా ముందస్తు ఎన్నికల ప్రచారం నడుస్తోంది. ఇటీవల కేసీఆర్ మూడు రోజుల పాటు కసరత్తు నిర్వహించి అభ్యర్థుల్ని కూడా ఖరారు చేసుకున్నారని అంటున్నారు. ఇప్పుడు అయితే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని.. అసెంబ్లీని రద్దు చేస్తే.. కర్ణాటకతో పాటే ఎన్నికలు జరిగితే కేసీఆర్, బీఆర్ఎస్కు తిరుగు ఉండదన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఎన్నికలకు వెళ్లే ఆలోచన కేసీఆర్ చేయవచ్చంటున్నారు.
పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి.. రాష్ట్రం అంతా నడిస్తే సీన్ మారిపోయే అవకాశం ఉంది. బీజేపీ హైకమాండ్ కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకుడానే ఎన్నికలకు వెళ్లే అవకాశాలుపై ఆలోచిస్తున్నారు. కేసీఆర్ ఉద్దేశం ప్రకారం…. ఆరు నెలలు ముందుగా ఎన్నికలు జరిగితే ముందస్తేం కాదు.. అందుకే.. ఈ ఫార్ములా ప్రకారం ఆయన వెళ్లొచ్చని చెబుతున్నారు. ఒక వేళ ఈ మంత్రివర్గ సమవేశంలో ముందస్తుపై నిర్ణయం తీసుకోకపోతే.. ఇక .. ఎన్నికలు నవంబర్, డిసెంబర్ లోనే జరుగుతాయి.