నారా లోకేష్ పాదయాత్ర ఇతర పాదయాత్రల్లో మార్నింగ్, ఈవినింగ్ వాకుల్లా జరగడం లేదు. తెల్లవారు జామున నాలుగు గంటలకు ప్రారంభమయ్యే లోకేష్ దిన చర్య అర్థరాత్రి వరకూ బిజీగా ఉంటోంది. ఈ సమయం మొత్తం ఆయన ప్రజలతోనే ఉంటున్నారు. విశ్రాంతి లేని షెడ్యూల్ అయినా ఆయన ఎక్కడా అలసి పోకుండా నిరంతరాయంగా నడక కొనసాగిస్తున్నారు. లోకేష్ ఇంత ఓపికగా ఎలా ఉంటున్నారబ్బా అని.. ఆయన తో నడిచే వారికే కాదు చూసే వారికీ అనిపిస్తున్నారు
లోకేష్ పాదయాత్రలో ప్రతి రోజూ ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత పార్టీ విషయాలపై చర్చలు జరుపుతారు. తర్వాత పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గంపై చర్చిస్తారు. దాదాపుగా ప్రతీ రోజూ తనతో సెల్ఫీలు దిగే వారి కోసం గంటకుపైగా కేటాయిస్తున్నారు. పెద్ద ఎత్తున క్యూలో వచ్చి సెల్ఫీ విత్ లోకేష్ అంటూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. అందరికీ ఓపికగా సెల్ఫీలు ఇస్తున్నారు. నిజానికి.. ఇలా ఎవరైనా నాలుగైదు నిమిషాలు ఫోటోలు తీసుకోవడానికే చిరాకొస్తుంది. కానీ లోకేష్ ప్రతీ రోజు… గంటకుపైగా సమయం వెచ్చిస్తున్నారు.
తర్వాత సమస్యలపై వచ్చిన వారితో మాట్లాడుతున్నారు. పాదయాత్రలో తనతో మాట్లాడటానికి వచ్చిన వారితో నడుస్తూనే మాట్లాడుతున్నారు. లంచ్ కూడా దారిలో సామాన్య జనం మధ్య పూర్తి చేయడానికే ప్రాధన్యం ఇస్తున్నారు. ప్రతీ రోజూ.. రెండు, మూడు వర్గాలతో సమావేశం అవుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ బాధిత వర్గాలతో సమావేశం అయి భరోసా ఇస్తున్నారు లోకేష్ పాదయాత్ర విషయలో పక్కా స్పిరిట్ చూపిస్తున్నారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించడం.. భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.
తన చేతిలో ఉన్నంత వరకూ పనులు చేసి పెడుతున్నారు. సొంత డబ్బుతో సాయం చేస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చాక అనే కబుర్లు చెప్పి మభ్య పెట్టడం లేదు. సాయంత్రం పాదయాత్ర ముగిసిన తర్వాత మరికొన్ని సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయనను కలవడానికి పెద్ద ఎత్తున వస్తున్న జనాలను నిరాశపర్చడం లేదు. ఓ నాయకుడికి ఇంత సహనం ఉంటే… విజయాలే ఎదురొస్తాయని.. టీడీపీ క్యాడర్ కూడా సంతృప్తి పడుతోంది.