దేశంశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తున్నదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా దేశంలోని తొమ్మిది మంది ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీజేపీయేతర నేతలను ఇరికించేందుకు సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని వీరు ఆరోపించారు. 2014 నుంచి బీజేపీ హయాంలో కేసులు నమోదుచేసినవారిలో ఎక్కువ మంది ప్రతిపక్షాలకు చెందినవారే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ మేరకు ఉమ్మడి లేఖ రాశారు.
ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ . పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఉన్నారు. వీరంతా బీజేపీకి మోదీకి ప్రతిపక్షమే కానీ.. వీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అధికార పక్షమే. వీరు మరి వీరు చేతిల్లో ఉన్న పోలీసు, దర్యాప్తు సంస్థల్ని తమ విపక్షాలపై ప్రయోగించడ ం లేదా ? అని ప్రశ్నించుకుంటే.. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని చెప్పుకోవాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల్ని నిర్వీర్యం చేయడానికి వారిపై ఎన్ని రకాల కేసులు పెట్టాలో.. అన్నీ పెట్టి.. నిఘా సంస్థల్ని..పోలీసుల్ని ఎంతగా దుర్వినియోగం చేయాలో అంతా చేశారనే ఆరోపణలు ఉన్నారు. మరి అప్పుడు విపక్షాల హక్కులు గుర్తుకు కాలేదా అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయి.
ఇక మమతా బెనర్జీ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఆ రాష్ట్ర వ్యవహారాలపై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. విపక్షమైన బీజేపీ నేతలు గగ్గోలు పెడుతూంటారు. ఇటీవల పంజాబ్ లో అధికారం చేపట్టిన భగవంత్ మాన్.. ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ తీసేయడంతో .. కాంగ్రెస్ నేత.. ప్రముఖ సింగల్ ను దుండగులు హత్య చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే….రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే.. తమ చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలు, పోలీసుల్ని విచ్చలవిడిగా వాడుకున్నారు. తమపై కేంద్రం ప్రయోగిస్తూంటే.. ప్రజాస్వామ్య హక్కుల గురించి చెబుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జల్సా సినిమాలో చెప్పినట్లుగా తుపాకీ ఎవరి చేతిలో ఉంటే వారు చెప్పేది నిజం.. అధికారం ఎవరి చేతుల్లో ఎక్కువ ఉంటే.. వారు చేసేదే కరెక్ట్. ఇలాంటి అధికారంలో ఉన్న వారు అనుకున్నంత కాలం.. ఈ వ్యవస్థ మారదు.