బిగ్ బీ అమితాబచ్చన్ గాయాల పాలయ్యారు. ప్రాజెక్ట్ కె షూటింగ్ సమయంలో ఆయనకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా తెలియపరిచారు. వైద్యులు కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అమితాబ్ ముంబైలోనే ఉన్నారు. కొన్ని రోజుల పాటు అభిమానుల్ని కలవలేనని, షూటింగులు కూడా రద్దు చేసుకొన్నానని అమితాబ్ ప్రకటించారు.
” ప్రాజెక్ట్ కె షూటింగ్లో భాగంగా కొన్నియాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నప్పుడు గాయాల పాలయ్యాను. పట్టెటెముకులకు దెబ్బ తగిలింది. వెంటనే షూటింగ్ రద్దు చేసుకొని హైదరాబాద్ లోని ఏఎంజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకొన్నాను. ఊపిరి తీసుకొంటున్నప్పుడు ఇబ్బందిగా ఉంటోంది. అందుకే ముంబైలోని నా ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకొంటున్నా” అంటూ తన బ్లాగ్ లో రాశారు బిగ్ బీ. అమితాబ్ గాయం వల్ల.. ప్రాజెక్ట్ కె షూటింగ్ వాయిదా పడింది. అంతే కాదు.. బిగ్ బీ నటిస్తున్న సినిమాల షూటింగులు కూడా రద్దయ్యాయి.