కోడికత్తి కేసులో తనపై చేసిన దాడిలో నిందితులకు శిక్ష పడేలా చేయడానికి కూడా సీఎం జగన్ కోర్టుకు వెళ్లడం లేదు. ఎన్ ఐఏ కోర్టు ఎప్పుడు విచారణ జరిగినా బాధితుడు కూడా తప్పకుండా హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశిస్తున్నరు. అయితే బాధితుడు అయిన సీఎం జగన్ మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఈ మంగళవారం జరిగిన విచారణకు కూడా సీఎం జగన్ హాజరు కాలేదు.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనపై విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగుతోంది. నాలుగేళ్లయిపోయింది. ఇప్పటికి చార్జిషీటు దాఖలు చేశారు. ప్రతీ వాయిదాకు కేసు విచారణకు నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు హాజరు పరుస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి అయిన CISF అసిస్టెంట్ కమాండర్ దినేష్ కుమార్ హాజరయ్యారు. ఆయనను కోర్టు ప్రశ్నించి వివరాలు తెలుసుకుంది.
మరోసారి బాధితుడు కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశిస్తూ NIA కోర్టు..తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసింది. ఘటన జరిగినప్పటి నుండి నిందితుడు శ్రీనివాసరావు జైల్లోనే ఉన్నారు. బెయిల్ కూడా రాలేదు. దాడికి వాడిన కోడి కత్తి గురించి న్యాయమూర్తి ఆరా తీశారు. దానిని తమ ముందు ప్రవేశ పెట్టాలని దర్యాప్తు అధికారుల్ని ఆదేశించింది. ఈ కేసులో సీఎం జగన్ బాధితుడు. ఆయన కోర్టుకుహాజరై.., జరిగిందేమిటో వాంగ్మూలం ఇస్తే కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు