కల్వకుంట్ల కవితను అరుణ్ రామచంద్ర పిళ్లై నిండా ముంచేశాడు. తాను కల్వకుంట్ల కవిత బినామీనేనని ఆమె తరపునే వ్యాపారం చేస్తున్నానని డిల్లీ లిక్కర్ స్కాం ద్వారా వస్తున్న డబ్బులన్నీ కవితకే వెళ్తాయని ఆయన ఈడీకి వెల్లడించారు. సౌత్త లాబీ ద్వారా ..ఢిల్లీ లిక్కర్ పాలసీ ద్వారా దుకాణాలు పొంది.. వ్యాపారం చేస్తున్న మూడు కంపెనీలకు అరుణ్ రామచంద్ర పిళ్లై ఓనర్ గా ఉన్నారు. అయితే అసలు ఓవర్ కవితేనని ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లుగా ఈడీ.. పిళ్లై అరెస్ట్ రిమాండ్ రిపోర్ుటలో వెల్లడించింది.
పిళ్లై రిమాండ్ రిపోర్టులో కవిత పేరును పలుమార్లు ప్రస్తావించారు. డబ్బులు ఎలా రూటింగ్ అయ్యాయన్న విషయాన్ని కూడా వివరించారు. పిళ్లై, బుచ్చిబాబు, అభిషేక్ లను సిండికేట్గాతయారు చేసి ముఫ్పై శాతం ఢిల్లీ లిక్కర్ వ్యాపారం కైవసం చేసుకున్నరని తెలిపారు. మొత్తం పన్నెండు శాతం లాభంలో ఆరు శాతం ఆప్ కు ఇచ్చారని..ఇలా 296కోట్లు లాభం పొందారని ఈడీ చెప్పింది.
ఇంకా విశేషం ఏమిటంటే.. ఈ రిమాండ్ రిపోర్టులో ఈడీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు కూడా ప్రస్తావించింది. ఆయన ప్రేమ్ రాహుల్ అనే వ్యక్తిని బినామీగా పెట్టుకుని కథ నడిపించారని తేల్చింది. ఇప్పటికే మాగుంట కొడుకు రాఘవరెడ్డి అరెస్టయి జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన పేరును రిమాండ్ రిపోర్టులో చేర్చారు. మొత్తంగా ఈ రిమాండ్ రిపోర్టు చూస్తే.. కవితను ఏ క్షణమైనా విచారణకు పిలవడం లేదా అరెస్ట్ చేయడం జరగవచ్చని అంచనా వేస్తున్నారు.