ఓ సారి స్కిల్ స్కాం పేరుతో హడావుడి చేసి.. మళ్లీ ఇప్పుడు.. ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో తెరపైకి తెచ్చినట్లుగా కనిపిస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ స్కాం బురద చల్లడానికా… సీఐడీ సీరియస్ గా ఉందా అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది. స్కిల్ డెలవప్మెంట్ స్కాం పేరుతో సీఐడీ చెబుతున్న మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి నిధులు విడుదల చేసింది రిటైర్డ్ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి కాగా.. కేత్ర స్థాయిలో పర్యటనలు చేసి.. రిపోర్టులు ఇచ్చి.. ఒప్పందం చేసుకోవాలని సూచించింది ప్రస్తుతం సీఎం కు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్, షంషేర్ సింగ్ రావత్‌లు.
సీఐడీ ఎఫ్ఐఆర్లో నిధులు మంజూరు చేసిన ఎండీ పేరు లేదు. రెండు కీలక కమిటీల చేతుల మీదుగా ఈవ్యవహారాలు నడిచాయి. ఆ కమిటీలకు సారధ్యం వహించిన ఐఏఎస్‌ల పేర్లూ లేవు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున టీడీపీ హయాంలో 40కిపైగా నైపుణ్య అభివృద్ది కేంద్రాలు సిమెన్స్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. దానికి ఎండీగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రేమ్ చంద్రారెడ్డి చెల్లింపులు చేశారు. అదే సమయలో రెండు కమిటీలు ఈ మొత్తాన్ని పర్యవేక్షించాయని.. ఆ కమిటీలకు ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్, రావత్‌లు నేతృత్వం వహించారు. వారి సిఫార్సుల మేరకే అన్నీ జరిగాయి.
వారిని విచారింకుండా అసలు విషయాలు బయటకు రావు. కానీ వారిని ప్రశ్నించేందుకు మాత్రం ఇప్పటి వరకూ సీఐడీ కనీసం ప్రయత్నించలేదు. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఎవరెవరు ఎంతెంత లంచాలు తీసుకున్నారో చెప్పాలి. ఎక్కడెక్కడ లావాదేవీలు జరిగాయో వివరించాలి .కానీ ఏపీ సీఐడీ అధికారులు అవినీతి జరిగిందని చెప్పరు. “స్కిల్ స్కాం” పేరుతో హడావుడి చేస్తున్న సీఐడీ ఎక్కడైనా అవినీతి లావాదేవీ జరిగిందో చెప్పడం లేదు. కానీ నిధుల దుర్వినియోగం అని చెబుతోంది. అది ఎలాంటి దుర్వినియోగమో చెప్పడం లేదు. సీమెన్స్ కంపెనీ జీఎస్టీ ఎగ్గొట్టినా అది ఇక్కడ స్కామేనని కలరింగ్ ఇస్తున్నారు.
తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయంగా విపక్ష పార్టీలపై బురద చల్లి తమ పబ్బం గడుపుకోవడానికే స్కిల్ స్కాం అనేది ఈ పరిణామాలతో అర్థమవుతోందన్న వాదన వినిపిస్తోంది