వైసీపీ సోషల్ మీడియా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి చేతికి వెళ్లిన తర్వాత మరీ అమాయకంగా తయారైంది. ఈజీగా దొరికిపోయే ఫేక్‌లు చేయడమే కాకుండా.. వాటిని సాక్షిలో కడా వేయించి.. దొరికిపోయి జగన్ ను దారుణమైన తిట్లు తిట్టేలా చేస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అనిత మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఓ వీడియోను మార్ఫింగ్ చేశారు జగన్ ను పొగుడుతున్నట్లుగా మార్ఫింగ్ చేశారు. ఈ వీడియోను సాక్షిలో కూడా ప్రసారం చేశారు. ఇది చాలదన్నట్లుగా ఆమెను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరణ అడిగినట్లుగా ఓ లెటర్ ను కూడా సృష్టించారు. ఈ ఫేక్‌ల గోల ఎక్కవైపోవడంతో అనిత మీడియా ముందుకు వచ్చి వాళ్లను వీళ్లను కూడా జగన్ నే ఇష్టం వచ్చినట్లుగా తిట్టేశారు.
జగన్ ఫేక్ సీఎం అన్నది అందరికీ తెల్సిందేనని.. మహిళా దినోత్సవం సందర్భంగా నా ఫేక్ ట్రోలింగ్ కి దిగజారాడని అనిత విశాఖలో నిర్వహించిన ప్రెస్మీట్లో తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేయడం దారుణమని… ఇలా చేసిన వాడిని కన్న తల్లి కూడా సిగ్గుపడుద్దని.. చేయించిన వాడు ఇంకా సిగ్గు పడాలన్నారు. ఈ ఫేక్ చేసిన వాళ్లు .. చేయించినవాళ్లని అరేయ్ నీ కన్న తల్లిదండ్రులు ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి అని మండిపడ్డారు. తనపై ట్రోలింగ్ చేసి.. మళ్లీ తనకే ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని అనిత మండిపడ్డారు.
తన వీడియోను ట్రోల్ చేయడమే కాకుండా.. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో ఓ ఫేక్ షోకాజ్ లెటర్ రిలీజ్ చేశారని.. జగన్ బ్యాచ్ రూ. 5 ఆశపడి ఫేక్ బ్రతుకులు బతుకుతున్నారని.. బురదలో బ్రతికే బ్రతుకులు వైసీపీ ఫేక్ బ్యాచ్ వన్నారు. సాక్షి పైనా, ఫేక్ బ్యాచ్ పైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని.. అట్రాసిటీ కేసు పెడతానని ప్రకటించారు. మిగతా వారి మాదిరిగా వదలననని.. మీ నాయకుడు నత్థి పకోడీ గాడిపై మీ టేలెంట్ చూపించాలని అనిత సవాల్ చేశారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసే వారి ఇళ్లకు వచ్చి చీపురుతో చితకబాదుతానని హెచ్చరించారు.
ఇటీవల వైసీపీ సోషల్ మీడియా ఫేక్ లనే నమ్ముకుంటోంది. కట్ పేస్ట్ చేయడం.. కొంత చూపించడం మాత్రమే చేయడం లేదు.. ఇతర మాటలను కూడా కలుపుతోంది. ఇవి ఈజీగా ఫేక్ అని తెలిసిపోతుంది. కానీ సజ్జల భార్గవ మాత్రం మన టాలెంట్ సూపర్ అనుకుని సోషల్ మీడియాలోనే కాదు.. టీవీలో కూడా వేయిస్తున్నారు. అంతిమంగా జగన్ ను బూతులు తిట్టిస్తున్నారు.