చాలా కాలంగా నరేష్, పవిత్రలు టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా నిలుస్తూ వచ్చారు. ఇద్దరూ సహ జీవనం చేస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అనుకొన్నారు. నరేష్ మాజీ భార్య రమ్య రంగంలోకి దిగి.. ఈ వ్యవహారాన్ని మరింత రచ్చ రచ్చ చేసేసింది. కోర్టు గొడవలూ – పోలీస్ స్టేషన్లలో కేసులతో…. మీడియా ఫోకస్ వాళ్లపై మరింతగా పడిపోయింది. `మేం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం` అంటూ… నరేష్, పవిత్రలు ఆ మధ్య ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పుడు పెళ్లి కూడా జరిగిపోయింది. నరేష్, పవిత్రల పెళ్లి వీడియో ఒకటి బయటకు వచ్చింది. కొత్త ఆనందాలతో.. కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్టు ఈ జంట పేర్కొంది. అయితే ఇది పెళ్లి వీడియోలా లేదు. ఓ సినిమా టీజర్లా ఉంది. అలా… కట్ చేశారు. మొత్తానికి… నరేష్ – పవిత్రలు పెళ్లితో సెటిల్ అయిపోయారు. పెళ్లి చేసుకోబోతున్న వార్త రాగానే… నరేష్ మాజీ భార్య రమ్య నానా గొడవ చేసింది. మరి ఇప్పుడు ఏకంగా పెళ్లే అయిపోయింది. ఇప్పుడు ఇంకెన్ని గొడవలు మొదలవుతాయో..? మరోవైపు రమ్య సెటిల్మెంట్ ఎప్పుడో అయిపోయిందని, అందుకే నరేష్ ధైర్యంగా పెళ్లి చేసుకొన్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.