ఆంధ్రప్రదేశ్‌లో టీచర్స్, గ్రాడ్యూయేట్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు టీచర్స్, మూాడు గ్రాడ్యూయేట్ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి. ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి పెద్ద ఎత్తున ఫేక్ ఓట్ల ఆరోపణలు వస్తున్నాయి. విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ నకిలీ ఓటర్ల విషయాన్ని సాక్ష్యాలతో సహా మీడియా ముందు చూపిస్తున్నారు. అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఈ దొంగ ఓట్లపై విస్తృతంగా ఉద్యమం చేస్తున్నాయి.
తిరుపతిలో వేలల్లో దొంగ ఓట్లు ఉన్నాయని టీడీపీ , బీజేపీ నేతలు చెబుతున్నారు. ఒకే వ్యక్తికి అనేక మంది తండ్రుల పేర్లు పెట్టి ఓటు నమోదు చేయడం.. ఓకే మహిళకు అనేక మంది భర్తల పేర్లు పెట్టి ఓట్లు నమోదు చేయడం వంటివి బయటపడ్డాయి. అలాగే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ తో పాటు అసలు పట్టభద్రులే లేని ఇంటి నెంబర్‌తో పెద్ద ఎత్తున ఓట్లు నమోదు కావడం సంచలనంగా మారింది. ఆధారాలతో వీటిని విపక్ష నేతలు బయట పెడుతున్నారు.
అడ్డదారుల్లో గెలిచేందుకు అధికార పార్టీ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల సాయంతో ఇలాంటి దొంగ ఓట్లను సృష్టించిందన్న ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణల విషయంలో ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా స్పందించలేదు. పోలింంగ్ బూత్‌లలో సీనియర్లను కూర్చోబెట్టి ఇలాంటి వారు ఓటు వేయకుండా నిరోధించాలని అనుకుంటున్నారు. ఈ ప్రయత్నాలు ఎంత వరకూ సక్సెస్ అవుతాయో కానీ.. దొంగ ఓట్లతో గెలిచిపోవాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం విమర్శల పాలవుతున్నాయి.