ఏపీలో ఏం జరుగుతోంది ? తాను కేసుల్లో ఇరుక్కుపోతున్నానని ప్రతీకారం తన ప్రత్యర్థుల్ని కూడా కేసుల్లో ఇరికించి జైలుకు పంపాలన్న ఓ ప్రతీకార బుద్దితో పాలన సాగుతోంది. అవి అసలు కేసులా.. తప్పుడు కేసులా… అన్నది అప్రస్తుతం. ముందు ఏదో ఓ నింద వేసి వారిని జైలుకు పంపిస్తే కానీ మనశ్సాంతి ఉండదన్నట్లుగా పాలకుల తీరు కనిపిస్తోంది. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో గతంలో ఎన్ని సోదాలు చేయాలో అన్నీ చేశారు. నిజానికి ఇతర చిట్ ఫండ్ కంపెనీలపై ఎన్నో ఫిర్యాదులు వినియోదారుల నుంచి వస్తూంటాయి. కానీ మార్గదర్శి విషయంలో మాత్రం ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు లేవు.
కానీ కసి, పగ, ప్రతీకారాలతో అధికారుల్ని ప్రయోగించారు. మార్గదర్శి యాజమాన్యం న్యాయస్థానానికి వెళ్లింది. తీవ్రమైన చర్యలొద్దని ఆదేశాలిచ్చినా మళ్లీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే వాతావరణం ఏర్పడటం… ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూడటంతో… అవన్నీ ప్రజలకు చెబుతున్న మీడియాపై కసి పెంచుకున్నారు. రామోజీరావుపై కేసు పెట్టేశారు. ఇక స్కిల్ స్కాంలో … జీఎస్టీ ఎగ్గొట్టాయని సీమెన్స్ , డిజైన్ టెక్ పై ఈడీ కేసులు పెడితే.. ఇందులో డబ్బులు చంద్రబాబుకు చేరాయంటూ కొత్త కథలు రాపిస్తూ.. సీఐడీతో కొత్త కొత్త వేషాలు వేయిస్తున్నారు.
రామోజీరావు, చంద్రబాబులను అర్థరాత్రి సీఐడీ పోలీసుల్ని పంపి వారి ఇళ్ల గోడలు దూకి అర్థరాత్రి అరెస్టులు చేయించినా ఆశ్చర్యం లేదు. ఎందుకుంటే.. ఏపీలో ఉంది క్రిమినల్ బ్రెయిన్ పాలకులు. ఇలాంటి పగ, ప్రతీకారాలతో తప్పుడు కేసులో వ్యతిరేకుల్ని అరెస్ట్ చేసినా ఏమీ కాదని.. గత నాలుగేళ్లుగా నిరూపిస్తూనే ఉన్నారు. మహా అయితే బెయిల్ పై బయటకు వస్తారు.. కానీ అరెస్ట్ .. కేసులు అనే లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఇప్పుడు అదే తెర ముందు కనిపిస్తోంది. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు పాలకులు అయితే ఎంత అరాచకం ఏర్పడుతుందో… ఏపీ పరిపాలకుల్ని కళ్ల ముందు కనిపించేలా చేస్తున్నారు.