బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమర్థించారు కానీ సొంత ఎంపీ ధర్మపురి అర్వింద్ మాత్రం ఖండించారు. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించనని.. ఆయన ప్రకటించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని.. ఆయనే వివరణ ఇవ్వాలన్నారు. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సబంధం లేదని స్పష్టం చేశారు.
ఇప్పటికే బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పు పడుతూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఆయనపై కేసులు నమోదు చేశారు. మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సొంత పార్టీ నుంచి కూడా బండి సంజయ్ కు సెగ ప్రారంభం కావడం ఆ పార్టీలో పరిస్థితులకు అద్దం పడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బండి సంజయ్ ఏకపక్ష ధోరణి వల్ల పార్టీకి ఎంత లాభం కలుగుతుందో అంత కంటే ఎక్కువ నష్టం జరుగుతోందని ఆ పార్టీలో కొంత మంది ఫైర్ అవుతున్నారు అయితే బండి సంజయ్ పైనే హైకమాండ్ నమ్మకం ఉంచుతోంది . ఆయననే టీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగించాలని హైకమాండ్ నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.
ఈ కారణంగానే అర్వింద్ కూడా అసంతృప్తికి గురయ్యారని తెలుస్తోంది. అధ్యక్ష పదవి పవర్ సెంటర్ కాదు.. కో ఆర్డినేషన్ సెంటర్ అని అర్వింద్ చెబుతున్నారు. అర్వింద్ కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. బండి సంజయ్ కు స్వపక్షంలో విపక్షం పెరిగిపోవడం… ఆయన వర్గానికి మింగుడు పడటం లేదు.