ఆస్కార్ రెడ్ కార్పెట్ పై సతీమణి ఉపాసనకి జోడీగా సందడి చేశాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా ఓ శుభవార్త కూడా చెప్పాడు. స్థానికి మీడియా ఛానల్‌తో చరణ్ మాట్లాడుతూ ”నా భార్య ఉపాసన ఆరు నెలల గర్భిణి. త్వరలో రాబోతున్న మా సంతానానికి ఆస్కార్ వేడుక… ఈ అనుభవం అన్నీ తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి” అని చెప్పుకొచ్చాడు. ”చరణ్‌ని సపోర్ట్ చేయడానికే ఇంత దూరం వచ్చాను. ఆర్.ఆర్.ఆర్ కుటుంబంలో నేనూ భాగం కావడం ఆనందంగా ఉంది“ అని ఉపాసన ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ “నేను కేవలం ఆర్.ఆర్.ఆర్ టీమ్ సభ్యుడిగానే కాదు.. ఓ అభిమానిగా ఇక్కడి వరకూ వచ్చాను. దాదాపు 250 చిత్రాలకు స్వరాలు అందించిన కీరవాణికి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను“ అని చెప్పుకొచ్చాడు. ఆస్కార్ వేదికపై డాన్స్ చేస్తారా? అని అడిగితే.. `డాన్స్ చేయడానికి ఇన్విటేషన్ రాలేదు“ అని స్పష్టం చేశాడు. అయితే ఇది వరకు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఆస్కార్ వేదికపై డాన్స్ చేయాలని పిలుపు వచ్చిందని, కానీ… రిహార్సల్స్ చేయడానికి టైమ్ లేకపోవడంతో చేయట్లేదని చెప్పిన సంగతి తెలిసిందే. అప్పుడు ఎన్టీఆర్ అలా అంటే.. ఇప్పుడు చరణ్ ఇన్విటేషన్ రాలేదని చెప్పడం విశేషం.