ఢిల్లీలో విజయసాయిరెడ్డి వ్యవహారం రాను రాను తేడాగా మారుతోందని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన వ్యవహార శైలి.. ఇప్పటి వ్యవహాశైలిని వారు పరిశీలించి.. హైకమాండ్ కు నివేదికలిస్తున్నారు. ఇతర ఎంపీలతో ఆయన కలుస్తున్నది తక్కువే.కానీ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండే అడ్వాంటేజ్ తీసుకుని ఇతర పార్టీల నేతలతో ముఖ్యంగా తాను గతంలో శుత్రుత్వం పెంచుకున్న వారితో సన్నిహితం అవుతున్నారు.
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ నివాసంలో జరిగిన ఓ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ తో ఆయన వ్యవహరింంచిన విధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. జైరాం రమేష్ .. విజయసాయిరెడ్డి భుజం మీద చేయి వేసి మాట్లాడుతూ కనిపించారు. ఆయన చేయి వేయడాన్ని ఓ ప్రివివేజ్ గా విజయసాయిరెడ్డి భావించి ఇంకా ఒద్దికగా నిలుచుకున్నారు. విజయసాయిరెడ్డి … గతంలో వైసీపీ తరుపున దూకుడుగా ఉండేవారు. బీజేపీని మెప్పించడానికి ఆయన సోనియా సహా అందరిపై విమర్శలు చేసేవారు. అవసరం లేకపోయినా రాహుల్ ను టార్గెట్ చేసేవారు.
కానీ ఇప్పుడు ఆయన తీరు మారిపోయింది. వైసీపీ అధినాయకత్వం ఆయనను దూరం పెట్టిందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన ఇలా అందరితో కలిసి పోవడం ఆశ్చర్యకరంగా మారింది. ఆయన వైసీపీ పార్టీని ఢిల్లీలో ఇలా కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా జరుపుతున్నారన్న అభిప్రాయం…. బీజేపీకి కలిగితే… జగన్ కు చిక్కులు తప్పవన్న ఆందోళన ఉంది. అందుకే విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒక వేళ లేకపోతే.. వివేకా కేసులో పరిణామాలతో… వైసీపీ ఓ సంకేతాన్ని విజయసాయిరెడ్డి ద్వారా బీజేపీకి పంపుతోందని అనుకునే అవకాశం ఉంది.