ఇంత ఫ్రెష్షు చేపలు, రొయ్యలు తింటారని పులివెందుల జనం కూడా అనుకోని ఉండరని… ఫిష్ ఆంధ్రా స్టాల్ ను తన నియోజకవర్గంలో ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ … అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన మోములో తన కుటుంబానికి దశాబ్దాలుగా ఓట్లు వేస్తున్న జనానికి మంచి చేపలు, రొయ్యలు, పీతలు ఇతర కూరలు పెట్టిస్తున్నానన్న గర్వం కనబడింది. అంతే కాకుండా… తన ఆలోచన చాలా మందికి చేపల మార్కెట్ పెట్టుకునేలా చేసి ఉపాధి కల్పిస్తోందన్న అతిశయం కూడా కనిపించింది.
ఆ ఫిష్ ఆంధ్రా చేపల మార్కెట్లను రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. చేశారు. అయితే ఇప్పుడు ఆ చేపల మార్కెట్లలో 90 శాతం మూతపడ్డాయి. చివరికి పులివెందులలో జగనన్న చేపల మార్కెట్ కూడా మూతపడింది. పరువు పోతుందని మీడియాలో హైలెట్ అవుతోంది.. ఒకటి రెండు సార్లు బలవంతంగా తెరిపించారు కానీ… ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు ఏపీ మొత్తం ఫిష్ ఆంధ్రా స్టాల్స్ లో 90 శాతం మూతపడ్డాయి. వీటిని కాపాడటానికి చివరికి కర్రీ పాయింట్లు చేద్దామనుకున్నారు. అయినా తట్టుకోలేకపోయాయి.
అసలు ఈ ఫిష్ ఆంధ్రా స్టాళ్ల స్కీమ్ వెనుక ఏమైనా స్కామ్ ఉందా … మత్స్యకారుల జీవనాధారం అయిన ఇలాంటి వ్యాపారాన్ని వారి పొట్ట కొట్టి ఎందుకు ఇతరుల చేతుల్లో పెట్టాలనుకున్నారన్నది ఇప్పుడల్లా బయటకు రాకపోవచ్చు. అయితే ఇలాంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఫ్లాప్ అవుతాయని అందరికీ తెలుసు. పైగా ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి జీరో పర్సంట్. అందరూ కష్టపడి … ఖర్చు పెట్టుకుని తన ప్రభుత్వానికి పేరు తేవాలని అనుకుంటారు కానీ.. వారికి అందించే సాయం సున్నా.
అయితే ఓ సీఎం స్థాయి వ్యక్తి చేయాల్సిన ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉండాలి కానీ.. యువతకు చేపల మార్కెట్లు పెట్టిస్తాం అంటే… ఫలితం ఇలానే ఉంటుందన్న సైటైర్లు సహజంగానే పడుతున్నాయి.