ఏపీలో మూడు గ్రాడ్యూయేట్, రెండు టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది. అయితే ఇవి గ్రాడ్యూయేట్, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలు. కానీ.. ఈ పోలింగ్ లోనూ సాధారణ ఎన్నికల నాటి పరిస్థితులు కనిపించాయి. బస్సుల్లో దొంగ ఓటర్లను తరలించుకు రావాల్సిన అవసరం ఈ సారి లేదు కానీ…స్థానికంగానే పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఓటర్ల నమోదు సమయంలోనే డిగ్రీ చేయని వాళ్లను పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదుచేశారు. వారితోనే ఓట్లేయించుకున్నారు. మీడియా మొత్తం ఈ దొంగ ఓటర్లపై ఫోకస్ పెట్టింది. టీడీపీ నేతలు పట్టించారు. అయినా వైసీపీ నేతలు వెనక్కి తగ్గలేదు.
ఆ దొంగ ఓటర్లు ఓట్లు వేయకపోతే గెలుపు సాధ్యం కాదని అనుకున్నారేమో కానీ పోలీసులను పూర్తి స్థాయిలో వాడుకున్నారు. దొంగ ఓటర్లను గుర్తు పట్టే టీడీపీ నేతలను… పోలింగ్ ఏజెంట్లను.. అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. తిరుపతితో పాటు పులివెందులలోనూ ఇలాంటి దొంగ ఓట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తిరుపతిలో దాదాపుగా సగం దొంగ ఓట్లేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆటోడ్రైవర్లు, ఆరేడు తరగతులు చదువుకున్న వారు, ఇంటర్మీయట్ కురాళ్లు కూడా ఓట్లు వేశారు. పోలీసులు అండగా నిలిచారు.
ఇక డబ్బుల పంచడం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పోలింగ్ బూత్ ల వద్ద కౌంటర్లు పెట్టేశారు. వైసీపీ నేతల అరాచకాలు చూసి… సామాన్య ప్రజలు కూడా… ఎవరూ ఓట్లేయరని జగన్ డిసైడైపోయారని అందుకే ఇలా చేస్తున్నారని గుసగుసలాడుకోవడం కామన్ అయిపోయింది. ప్రతీ చోటా ఈ దొంగ ఓట్లు… ఓట్లు కొనడానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అయితే దొంగ ఓటర్లు మినహా ఇతరులు చదువుకున్నవారు వేసిన ఓట్లు కావడంతో… ఇలా చేసినా.. వైసీపీకి ధీమా లేకుండా పోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.