జనసేన పార్టీ సాధారణంగా జన సమీకరణ చేయదు. స్వచ్చందంగా వచ్చే వారే ఆ పార్టీకి ఎక్కువ. ఈ సారి మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గ ఇంచార్జులు విజయవాడ నుంచి కూడా కొంత మందిని సమీకరించారు. అయినప్పటికీ పదో ఆవిర్భావ వేడుకలకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. దారి పొడుగూతా ర్యాలీ జన సందోహంతో నడిచింది. వారాహి మందుకు కదలనంతగా జనం వచ్చారు. బహిరంగసభలోనూ అలాగే ఉన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఇదే అతి పెద్ద బహిరంగసభ అని చెప్పుకోవచ్చు.
అలాగే టీడీపీ ముఖ్యనేతలు ఎక్కడ పర్యటించినా జన ప్రభంజనమే వస్తుంది. చంద్రబాబు బహిరంగసభ కాకపోయినా రోడ్ షో అంటేనే… రెడ్డి జనాభా మెజార్టీ ఉంటే ఆనపర్తిలో జన ప్రభంజనం కనిపించింది. లోకేష్ రోడ్ షోలో నియోజకవర్గాల్లోని ఓ మాదిరి పట్టణాల్లో ఆయనతో కలిసి పాల్గొంటున్న ప్రజల్ని చూస్తే.. ప్రజల్లో ప్రభుత్వంపై ఇంత అసంతృప్తి ఉందా అని అనిపించక మానదు. ప్రతిపక్ష నేతలు ఎక్కడికి వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇది రాజకీయవర్గాలకు ఓ స్పష్టమైన సూచనలు ఇస్తున్నాయి.
మరో వైపు అధికార పార్టీ పెట్టే సభలు వెలవెలబోతున్నాయి. ఇంటింటికి తాయిలు పంపే చెవిరెడ్డి… లోకేష్ పర్యటన తర్వాత బలప్రదర్శన చేయడానికి సభ పెడితే కుర్చీలు కూడా నిండలేదు. ఇక జగన్ రాజకీయ ప్రసంగాలు చేసే .. ప్రభుత్వ బహిరంగసభకు జనాన్ని ఎలా తరలించుకు వస్తున్నారో.. వారు ఎలా పారిపోతున్నారో కళ్ల ముందు కనిపిస్తుంది. వైసీపీ క్యాడర్ పూర్తిగా నిరాశలో ఉంది. ఓ వైపు అధికారపక్షంపై నిరాశక్తత… విపక్ష నేతలపై ప్రజల్లో నమ్మకం కనిపిస్తూండటం… భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతకంగా కనిపిస్తోంది.