రెండు మూడు వికెట్లు ఎగిరిపోతాయని మంత్రులకు జగన్ కాస్త వెటకారంగా చెప్పారు. ఆ మాటలు విన్న మంత్రులకు ఎలా ఉందో కానీ… ఈ విషయం బయటకు తెలిసిన తర్వాత మాత్రం కెప్టెన్ మైండ్ ఇంత నేరోగా ఉంటుందా అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే… ఆయన ఎగరగడొతానంటున్న వికెట్లు ఆయన టీమ్ లోనివే.
మంత్రులపై సీఎం జగన్ చేస్తున్న కామెంట్లు వారికి ఏ మాత్రం ఆత్మగౌరవం ఉండదని… ఉంట ఉంటారు.. తీసేస్తే ఎగిరిపోతారన్నట్లుగా ఉంటున్నాయి. రెండు, మూడు వికెట్లు ఎగిరిపోతాయని…. మంత్రులతో జగన్ చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. సహచరులను ఇంత చులకనగా సీఎం జగన్ ఎందుకు చూస్తున్నారని మంత్రులు కూడా ఫీల్ కావాల్సి వచ్చింది. మంత్రి పదవులు జగన్ చాయిసే కావొచ్చు కానీ.. పదవి ఇచ్చామని … ఇలా వ్యక్తిత్వం కూడా ఉండదన్నట్లుగా వ్యవహరించడం ఏమిటని మథనపడుతున్నారు.
అసలు మంత్రులకు పని చేసే అవకాశమే లేదు. అంతా సకలశాఖా మంత్రి చేస్తారు. సీఎంవో చూసుకుంటుంది. అలాంటిది పని తీరుపేరుతో కొంత మందిని తీసేయడానికి రంగం సిద్ధం చేయడం జీర్ణించుకోలేనిదే. గత మంత్రి వర్గ విస్తరణ అప్పుడు బలహీనవర్గాలకు పెద్ద పీట అంటూ… తీసుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తానని వారిలో కొంతమందిని తీసి పక్కన పెడుతున్నారు. కొంత మంది పేర్లనూ లీక్ చేశారు. కొత్తగా మర్రి రాజశేఖర్ సహా మరో ఇద్దరు ఎమ్మెల్సీలను మంత్రుల్ని చేస్తారని.. ఆరేడు మంది తీసేసే జాబితాలో ఉన్నారని వైసీపీ వర్గాలు లీక్ చేశాయి.
మంత్రి పదవులు వచ్చిన వారు కనీసం కుదురుకునేలా చేయకుండా వారిని ఆభద్రతలో ఉంచి.. చివరికి పదవుల్ని ఉడగొట్టడం మాత్రం రాజకీయ వ్యూహం అనుకోవచ్చు. కానీ మంత్రులకు కనీస వ్యక్తిత్వం ఉండదన్నట్లుగా జగన్ వ్యవహరించడం… వికెట్లు ఎగిరిపోతాయని వ్యాఖ్యానించడం సీఎం జగన్ మనస్థత్వానికి అర్థం పడుతోందంటున్నారు. ఆ వికెట్లు ఆయనేవన్న సంగతిని మార్చిపోతున్నారని మంత్రులు కొంత మంది సెటైర్లు వేసుకుంటున్నారు.