వివేకానందరెడ్డిని హత్య చేసి ఇవాళ్టికి కరెక్టుగా నాలుగేళ్లు., ఈ కేసు సీబీఐకి వెళ్ల క ముందు .., మా బాబాయ్ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లుగా కనిపించి .. విగ్రహాలు పెట్టి దండేసి సంతాపం ప్రకటించిన అబ్బాయిలు ఇప్పుడు కనీసం నివాళి అర్పించడానికి కూడా ఆసక్తి చూపించలేదు. అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు అవినాష్ రెడ్డి కానీ బాబాయ్ వివేకాను ఆయన వర్థంతి సందర్భంగా గుర్తు చేసుకునేందుకు ప్రయత్నించలేదు. వివేకా కుమార్తె సునీత పులివెందులలో తండ్రి వర్థంతి కార్యక్రమాలను నిర్వహించారు.
సునీత పులివెందులలో ఉండగా వైఎస్ కుటుంబంలో కొంత మంది ఆమె ఉంట ఉన్నారు. వివేకా సోదరుడు వైఎస్ సుధీకర్ రెడ్డి ఆయన అనుచరులు సునీత వెంట ఉన్నారు. మరికొంత మంది సునీతకు సంఘిభావం చెప్పినా … అవినాష్ రెడ్డి వర్గానికి కోపం వస్తందని సైలెంట్ గా ఉండిపోయారు. కర్నూలు, కడపల్లో ఇలా చంపుకోవడాలు సహజమేనని గతంలో తనతో విచారణధికారులు కొంత మంది అన్నారని గుర్తు చేసుకున్నారు కానీ.. హత్య చేసిందెరో నిందితులెవరో ప్రజలకు తెలియాలనే పోరాడుతున్నాన్నారు. బంధువుల మీద ఆరోపణలు చేస్తున్నాని తెలుసని.. కానీ అసలు నిందితులు పట్టుబడాల్సిందేనన్నారు.
వివేకా హత్య కేసును చివరికి సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిపై తోసేయడానికి తీవ్ర ప్రయత్నాలను జగన్ క్యాంప్ చేస్తోంది. ఈ కారణంగా వివేకా క్యాంప్ ను వారు శత్రువుగా చూడటం ప్రారంభించారు. బంధువులుగా కూడా చూడటం లేదు. వివేకా హత్య విషయంలో బయటకు వస్తున్న విషయాలు.., ఇప్పుడు ఆయనపై ఏ మాత్రం గౌరవం లేనట్లుగా .. కనీసం నివాళులు కూడా అర్పించలేని పరిస్థితి ఏర్పడటం కొత్త చర్చలకు కారణం అవుతోంది.