‘జాగ్రత్త.. హెచ్చరిస్తున్నా.. చిటిక వేస్తే చాలు.. నేను మూడో కన్ను తెరిస్తే’ అంటూ నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ నాయకుడు అలాగే ఉండాలని.. నీచానికి దిగజారకు అని ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. తెనాలి పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. దీనికి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఈ హెచ్చరికలు జారీ చేశారు.
దీనికి కారణం నర్సరావుపేటలో జరిగిన ఓ ఘటనే . నర్సరావుపేట పట్టణంలోని రామిరెడ్డిపేటలో శివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్ల కోసం ప్రభను రూపొందించారు. ప్రభ నిర్మాణానికి పార్టీలకతీతంగా భక్తులు విరాళాలు ఇచ్చారు. ప్రభ వద్ద డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ హీరో బాలకృష్ణ పాటలు పెట్టి డాన్స్ చేశారు. ఇలా డాన్సులు చేసిన వారిలో భాస్కర్ రెడ్డి అనే యువకుడు ఉన్నారు. బాలకృష్ణ పాటకు డాన్సులేశారన్న కారణంగా భాస్కర్ రెడ్డిని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి వేధించారు. దీంతో ఆయన ఎమ్మెల్యే ఇంటి ముందు ఆత్మహత్యాయత్నానిక ప్రయత్నింారు.
ఈ అంశం సంచలనం అయింది. ఈ ఘటన గురించి బాలకృష్ణకు తెలియడంతో ఆయన కూడా ఎమ్మెల్యే తీరుపై సీరియస్ అయ్యారు. సినిమాలు వేరు,రాజకీయాల వేరని.. అన్ని పార్టీల వాళ్లు తన సినిమాలు చూస్తారని బాలకృష్ణ అన్నారు. సినీ నటులకు అన్ని వర్గాల్లో అభిమానులు ఉంటారు మళ్లీ ఇలాంటివి పునర్వతం కాకుండా చూడాలని బాలకృష్ణ హెచ్చరించారు.