151 మంది సొంత ఎమ్మెల్యేలు విపక్షం నుంచి వచ్చిన మరో ఐదుగురు.. మొత్తంగా భలో ఉన్న వారిలో పదిహేను మంది తప్ప అందరూ అధికారపక్షం వారే. వారికీ సమాధానం చెప్పుకోలేని విధంగా అధికారపక్షం భయపడుతోంది. ప్రతీ దానికి సస్పెండ్ చేసి బయటకు పంపేస్తున్నారు. సభా కార్యక్రమాలు జరిగిన తొలి రోజు అేద పరిస్థితి. ఏపీ అసెంబ్లీ నుంచి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారు. వీరిలో పయ్యావుల కేశవ్ , నిమ్మల రామానాయుడు ను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు. మిగిలిన సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. ముందుగా ఎలాంటి తీర్మానం లేకుండా నేరుగా స్పీకర్ సస్పెండ్ చేశారు. ఎలాంటి ప్రతిపాదన లేకుండా తమరెలా సస్పెండ్ చేస్తారని టీడీపీ సభ్యులు ప్రశ్నించడంతో సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరలా సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు వినతి చేశారు. ఉదయం సభ మొదలైనప్పటి నుంచి కోటంరెడ్డి నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. తన నియోజక వర్గ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. సభలో పోడియం ముందు నిలబడి నియోజకవర్గ సమస్యలపై స్పీకర్‌కు కోటంరెడ్డి విజ్జప్తి చేశారు. కోటంరెడ్డిపై అధికార పక్ష సభ్యులు మండిపడ్డారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని ఈ షెషన్ మెత్తానికి సస్పెండ్ చేస్తూ నిర్ణయం స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకున్నారు.
చాలా స్వల్ప సంఖ్యలో ఉన్న విపక్ష సభ్యులను కనీసం ఎదుర్కోలేపోవడం ఏమిటని వైసీపీ సభ్యులు కూడా మధన పడే పరిస్థితి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేశారు కానీ.. వైసీపీ ఎమ్మల్యేలకు దూరంగా టీడీపీ ఎమ్మెల్యేలకు దగ్గరగా కూర్చుంటున్న ఆనంపై మాత్రం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.