ఏప్రిల్ ఒకటో తేదీ ఆర్బీఐ సెలవు, రెండో తేదీ అదివారం అందుకే మూడో తేదీన పెన్షన్లు ఇస్తాం అని కేబినెట్లోనే నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. అలాగయితే మార్చి 31నే ఇవ్వొచ్చు కదా అని చాలా మందికి వచ్చే డౌట్. అసలు విషయం ఏమిటంటే… మూడో తేదీన కూడా పెన్షన్లు రావు. ఎందుకంటే బిల్లులు పెట్టరు కాబట్టి. ఇప్పటికే జీతాల బిల్లులు కూడా పెట్టవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్థిక సంవత్సరం మారిన తర్వాత అప్పటికప్పుడు బిల్లులు పెట్టినా… మూడో తేదీన సోమవారం బ్యాంకులు పని చేయాలి.. వాటి దగ్గర నుంచి అధికారులు డబ్బులు డ్రా చేయాలి.. వాలంటీర్లకు ఇవ్వాలి. అదీ కూడా ఖజానాలోనే ఉంటేనే.
అప్పుడే సామాజిక పెన్షన్లు అందుతాయి. నికరంగా ఎలా చూసినా… కనీసం వారం రోజుల పాటు సామాజిక పెన్షన్లు పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఉద్యోగుల జీత భత్యాల గురించి పడాల్సిన టెన్షన్ చాలానే ఉండే అవకాశం ఉంది. ఆర్తిక సంవత్సరంలో చెల్లించాల్సిన బిల్లలకు.,.. సుదీర్ఘ కాలం పెండింగ్లో ఉన్న ఉద్యోగులుదాచుకున్న సొమ్ముల చెల్లింపునకు కొంత ఖర్చు చేశారు. కేంద్రం నుంచి ఈ నెల దండిగా నిధులు వచ్చాయి. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపులో క్లియర్ చేయాల్సిన బిల్లులు.. అస్మదీయులవైనా చెల్లిచాల్సి ఉంటుంది. అలాంటి వాటికి సరిపోతాయి. ఇక జనవరి నుంచి పెండింగ్ లో ఉన్న రూ. ఆరు వేల కోట్ల ఆసరా పథకం అమలు చేయకపోతే.. మురిగిపోతుంది. వచ్చే ఏడాది బడ్జెట్ లో మళ్లీ కేటాయించాల్సి వస్తుంది.అందుకే నెలాఖరు నుంచి అని చెబుతున్నారు. వాటికి డబ్బులు ఉన్నాయో లేవో స్పష్టత లేదు. ఒక్క సారి మీట నొక్కకుండా వారం రోజులు వారోత్సవాలు అంటున్నారు.
వచ్చే నెల పన్నుల వాటాను కూడా కేంద్రం ముందుగానే ఈ నెలలోనే ఇచ్చేసింది. ఏప్రిల్ లో పన్నుల వాటా కూడా అందదు. ప్రస్తుత ఏడాది చేసిన అప్పుల లెక్కలన్నీ తేలితేనే కొత్త అప్పులకు అనుమతి ఇస్తుంది. ఇది పరిమితి దాటిపోయింది కాబట్టి ఈసారి ఏపీపై ఆర్థిక ఆక్షలు ఎక్కువగా పెట్టే అవకాశం ఉంది. ఎలా చూసినా… వచ్చే ఏడాది ఏపీ ఆర్థికం మరింత దిగజారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.