మచిలీపట్నం సభలో పవన్ కల్యాణ్ ఏపీ బీజేపీ నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఎదగలేకపోవడానికి ఆ పార్టీనే కారణం అని నిందించారు. .అమరావతి మెదలుగొని, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేసే విషయం వరకు కాషాయ దళం తీరు పై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టిలో తనను ముందుగా పిలిచింది నరేంద్ర మోడీ అని ఆయన అంటే తనకు గౌరవం ఉందన్నారు. కానీ రాష్ట్ర నేతలు మాత్రం విరుచుకుపడ్డారు.
కేంద్రంలోని నాయకత్వంతో సంప్రదింపులు చేసిన తరువాత ఆంద్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు కలసి పని చేసేందుకు ముందు కు రాకపోవటం వలనే రాష్ట్రంలో తెలుగు దేశం బలపడగలిగిందని పవన్ కళ్యాణ్ మరింత ఘాటుగా వ్యాఖ్యానించారు. వైసీపీతో కుమ్మక్కయి మొత్తానికి నాశనం చేశారన్న అర్థంలో మాట్లాడారు. అయితే సోము వీర్రాజు మాత్రం అన్నీదులిపేసుకున్నారు. ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసి వెళ్తామని ప్రకటించలేదన్నారు. స్పీచ్‌లో ఎక్కడా పవన్ టీడీపీ ప్రస్తావన తీసుకు రాలేదని.. బీజేపీతోనే పొత్తులో ఉన్నామని చెప్పుకొచ్చారు. ముస్లింల విషయంలో పవన్ కల్యాణ్ ఎవరో ప్రస్తాన విషయం చెప్పారు కానీ.. బీజేపీని నిందించలేదన్నారు.
తాను బీజేపీతో ఉంటే జనసేనకు ముస్లింలు దూరమవుతారని కొందరు అంటున్నారని… ముస్లింలకు ఇష్టంలేకపోతే బీజేపీకి తాను దూరమవుతానని చెప్పారు. ఒకవేళ బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు వారిపై ఎక్కడైనా దాడి జరిగితే పొత్తు నుంచి బయటకు వస్తానని తెలిపారు. అయితే సోము వీర్రాజు మాత్రం పవన్ తో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. పవన్ సీరియస్ కామెంట్స్ చేసినా సోము వీర్రాజు మాత్రం బీజేపీని ఏమీ అనలేదని.. పొత్తు కొనసాగుతుందని ప్రకటనలు చేశారు. సొంత పార్టీలో నేతలు విమర్శిస్తే్ బయటకు పంపడానికి సోము వీర్రాజు రాజకీయం అంతా చేస్తారు. కానీ పవన్ విమర్శిస్తే మాత్రం.. దులిపేసుకుంటున్నారు.