ఏపీలో లెక్కకు మిక్కిలిగా ఆస్తులను కొనేస్తున్న అదానీ సీఎం జగన్తో తాడేపల్లిలో రహస్య సమావేశాలు జరుపుతూండటం హాట్ టాపిక్ అవుతోంది. అదానీ రహస్యంగా వచ్చి నాలుగు గంటలకుపైగా తాడేపల్లిలో గడిపి వెళ్లిన విషయం తర్వాత రోజే వెలుగులోకి వచ్చింది. ఆయన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకే వచ్చారని అధికారవర్గాలు ఈ విషయం బయటకు తెలిసిన తర్వాత చెబుతున్నాయి. అయితే ఉన్నత కుటుంబాల్లో వివాహానికి ఆహ్వానించే పద్దతి వేరుగా ఉంటుందని… కుటుంబ పెద్దలు వచ్చి ఆహ్వానించరని ఈ విషయాలపై అవగాహన ఉన్న వారు చెబుతున్నారు.
అదానీ గ్రూప్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది. హిండెన్ బెన్ రిపోర్ట్ తర్వాత ఆ సంస్థ మునిగిపోకుండా కేంద్రం వీలైనంతగా కాపాడుతోంది. ఇక ఏపీలో అదానీ గురించి చెప్పాల్సిన పని లేదు. అంతా అయిపోయిన తర్వాత కూడా.. మరికొన్ని ఎకరాలను విశాఖలో కేటాయించారు. సేల్ డీడ్ కూడా రహస్యంగా చేసేస్తే.. అాదనీ గ్రూప్ తాకట్టు పెట్టుకుందేమో తెలియదు కానీ ఇంతకు ముందు ఇచ్చిన 160 ఎకరాలకుపైగా భూమిని మాత్రం తాకట్టు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అాదానీ తన గ్రూప్ కంపెనీలు సంక్షోభం నుంచి బయటపడటానికి జగన్ మద్దతు అడగడానికి వచ్చారా .. . ఏపీ నుంచి మరింతగా ప్రయోజనం ఆశిస్తున్నారా అన్నది క్లారిటీ లేదు.
ఊరకనే రారు మహానుభావులు అని.. అదానీ లాంటి వ్యాపార వేత్త ఓ ముఖ్యమంత్రిని పెళ్లికి పిలుపుల లాంటికార్యక్రమాల కోసం కలవరు. అదీ కూడా నాలుగు గంటల సేపు. అందుకే ఇదులో ఏదో మతలబు ఉందని భావిస్తున్నారు. అదానీ విషయంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు కొత్తగా ఏమైనా ఉంటే… వాటిని సీక్రెట్ గా కాకుండా… బహిరంగంగా తీసుకుంటే… ఈ అంశాలపై స్పష్టత వస్తుంది.
ఇప్పటికే ఏపీని అదానీకి కట్టబెట్టేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు మరోసారి అలాంటి ఆరోపణలు బలంగా వచ్చే అవకాశం ుంది.