జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ క్యూ న్యూస్ చానల్ నడుపుతున్న తీన్మార్ మల్లన్ననూ భరించలేకపోతోంది. ఆయన కార్యాలయాలపై ఎన్ని సార్లు దాడులు చేశారో లెక్కలేదు.. ఈ సారి కొత్తగా ఆయన కార్యాలయంపై దాడులు చేసి మొత్తం ధ్వంసం చేయడమే కాకుండా ఏపీ తరహాలో ఎదురు కేసులు పెట్టి వారినే అరెస్ట్ చేశారు.
ఆదివారం క్యూ న్యూస్ఆఫీసులో కంప్యూటర్లు, ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేస్తూ సిబ్బందికి పట్టుబడ్డ సాయి కిరణ్‌గౌడ్ మల్లన్న, క్యూ న్యూస్ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. తనను తీవ్రంగా కొట్టి, హింసించి హత్య చేసేందుకు ప్రయత్నించారని అతను ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మల్లన్న, తెలంగాణ విఠల్, క్యూ న్యూస్సిబ్బందిపై పోలీసులు ఐపీసీ 307 సెక్షన్‌కింద హత్యాయత్నం, పలు నాన్బెయిలబుల్సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
సోషల్ మీడిాయలో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న తీన్మార్ మల్లన్నకు యువతలో విశేషమైన ఫాలోయింగ్ ఉంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. తర్వాత సొంత పార్టీ ఆలోచన చేశారు. కానీ పోలీసులు రకరకాల కేసులు పెట్టడంతో చాలా కాలం జైల్లో ఉన్నారు. చివరికి బీజేపీ సాయంతో బయటకు వచ్చారు. ఆ పార్టీలో చేరారు.కానీ అక్కడ ఇమడలేకపోయారు . ఏమైనా కానీ కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేక ప్రచారం చేస్తూంటారు.
దాంతో మరోసారి దాడి జరిగింది. రివర్స్‌లో ఆయనపైనే కేసు పెట్టారు. తెలంగాణ సమాజం ఇలాంటి వాటిని తేలికగా తీసుకోదు. ముఖ్యంగా పోరాటాల నేపధ్యం ఉన్న యువత… ఇలాంటి పోలీసుల తీరును తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఈ విషయం బీఆర్ఎస్ పెద్దలకు తెలియనిదేం కాదు. అయినా ఇలాంటి వి జరగుతూనే ఉన్నాయి. పరిణామాలు ఎలా ఉంటాయో ?